ENG vs NED : ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో 40వ మ్యాచ్ లో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ముఖాముఖి తలపడుతున్నాయి.

ENG vs NED : ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

icc cricket world cup 2023 today england vs netherlands live match score and updates

Updated On : November 8, 2023 / 9:13 PM IST

ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

340 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో నెద‌ర్లాండ్స్ 37.2 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 160 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

26 ఓవ‌ర్ల‌కు నెద‌ర్లాండ్స్ స్కోరు 115/5
భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో నెద‌ర్లాండ్స్ జ‌ట్టు త‌డ‌బ‌డుతోంది. 26 ఓవ‌ర్ల‌కు నెద‌ర్లాండ్స్ స్కోరు 115/5. తేజ నిడ‌మ‌నూరు (5), స్కాట్ ఎడ్వర్డ్స్ (20) లు ఆడుతున్నారు. బాస్ డి లీడే 10 ప‌రుగులు, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 33 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు.

మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
68 పరుగుల వద్ద నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. వెస్లీ బరేసి 37 పరుగులు చేసి రనౌటయ్యాడు. 19 ఓవర్లలో 73/3 స్కోరుతో నెదర్లాండ్స్ ఆట కొనసాగిస్తోంది.

2 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్
340 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 13 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. మాక్స్ ఓడౌడ్ 5 పరుగులు చేసి అవుటయ్యాడు. కోలిన్ అకెర్‌మాన్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. 7 ఓవర్లలో 21/2 స్కోరుతో నెదర్లాండ్స్ ఆట కొనసాగిస్తోంది.

నెదర్లాండ్స్ టార్గెట్ 340
నెదర్లాండ్స్ కు ఇంగ్లాండ్ 340 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ సెంచరీ చేశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 108 పరుగులు చేసింది. డేవిడ్ మలన్(87), క్రిస్ వోక్స్(51) హాఫ్ సెంచరీలు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే 3, ఆర్యన్ దత్ 2, లోగాన్ వాన్ బీక్ 2 వికెట్లు పడగొట్టారు.

 

బట్లర్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
178 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ 5 పరుగులు చేసి అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి నాలుగో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

మలన్ అవుట్.. మూడో వికెట్ డౌన్
139 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువైన డేవిడ్ మలన్ రనౌటయ్యాడు. 74 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో 15, జో రూట్ 28 పరుగులు చేసి అవుటయ్యారు. 25 ఓవర్లలో 163/3 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

 

నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్
ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 20 ఓవర్లలో 132/1 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది. డేవిడ్ మలన్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మలన్ 84, జో రూట్ 28 పరుగులతో ఆడుతున్నారు.

డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ
ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది ఏడవ అర్ధసెంచరీ. 13 ఓవర్లలో 81/1 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

బెయిర్‌స్టో అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 15 పరుగులు చేసి అవుటయ్యాడు.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్
ENG vs NED : వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో 40వ మ్యాచ్ లో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. వుడ్, లివింగ్‌స్టోన్ స్థానంలో బ్రూక్, అట్కిన్సన్ జట్టులోకి వచ్చారు. నెదర్లాండ్స్ టీమ్ లో జుల్ఫీకర్ స్థానంలో తేజ నిడమనూరు వచ్చాడు. నెదర్లాండ్స్ టీమ్ లో జుల్ఫీకర్ స్థానంలో తేజ నిడమనూరు వచ్చాడు. ఇప్పటివరకు ఇరు జట్లు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. నెదర్లాండ్స్ రెండు విజయాలు సాధించి 9వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ ఒక్క విజయం మాత్రమే సాధించి చివరి స్థానంలో ఉంది.

 

తుది జట్టు
ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్

నెదర్లాండ్స్ : వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్