Shikhar Dhawan : జ‌ట్టుకు దూరం చేసినా.. ఆల‌యంలో శిఖ‌ర్ ధావ‌న్ పూజ‌లు.. ఏం కోరుకున్నాడో తెలుసా..?

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World cup) జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Shikhar Dhawan : జ‌ట్టుకు దూరం చేసినా.. ఆల‌యంలో శిఖ‌ర్ ధావ‌న్ పూజ‌లు.. ఏం కోరుకున్నాడో తెలుసా..?

Shikhar Dhawan Prays For India Success

Dhawan : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World cup) జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మందిని ఎంపిక చేశారు. అయితే.. ఈ జ‌ట్టులో సీనియ‌ర్ ఆట‌గాడు అయిన శిఖ‌ర్ ధావ‌న్‌ (Shikhar Dhawan) కు చోటు ద‌క్క‌లేదు. దీంతో గ‌త ప‌దేళ్ల‌లో మొద‌టి సారి ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ధావ‌న్ దూరం అయ్యాడు. ఎడ‌మ చేతి ఓపెన‌ర్ బ్యాట‌ర్‌ను ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సైతం త‌ప్పుబ‌ట్టారు. అత‌డికి ఆఖ‌రి ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు.

కాగా.. మెగా టోర్నీకి దూరం చేసిన‌ప్ప‌టికీ శిఖ‌ర్ ధావ‌న్ ఆశావ‌హ ధృక్ప‌దంతోనే ఉన్నాడు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యాన్ని సంద‌ర్శించాడు. ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పూజ‌ల అనంత‌రం శిఖ‌ర్ ధావ‌న్ మీడియాతో మాట్లాడాడు. దేవుని ఆశీర్వాదం కోసం వ‌చ్చాన‌ని చెప్పాడు. ఇక రానున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌యం సాధించాల‌ని ప్రార్థించిన‌ట్లు వెల్ల‌డించాడు. టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాల‌న్న‌ది అంద‌రికి కోరిక అని, తాను కూడా అదే కోరిక కోరుకున్న‌ట్లుగా చెప్పాడు.

ODI World Cup : ప్ర‌పంచ‌క‌ప్‌కు అంపైర్లు వీరే.. లిస్ట్‌లో ఐర‌న్ లెగ్ అంపైర్‌..! టీమ్ఇండియాకు క‌ష్ట‌కాల‌మే..!

ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ఎంపిక చేసిన స‌మ‌యంలో శిఖ‌ర్ ధావ‌న్ సోష‌ల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. ‘వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ 2023 టోర్నమెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన నా తోటి సహచరులకు, స్నేహితులకు అభినందనలు.! 1.5 బిలియన్ల ప్రజల ప్రార్థనలు, మద్దతుతో, మీరు మా ఆశలు, కలలను మోసుకెళ్తున్నారు. మీరు కప్‌ను ఇంటికి తిరిగి తీసుకువచ్చి మమ్మల్ని గర్వించేలా చేయండి.!’ అని ధావన్ ట్వీట్ చేశాడు.

అంత‌క‌ముందు ఆసియా క‌ప్ 2023 జ‌ట్టును ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ మాట్లాడుతూ.. రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ రూపంలో ఇద్ద‌రు అద్భుత‌మైన ఓపెన‌ర్లు ఉన్నారన్నారు. ఇషాన్ కిష‌న్ రూపంలో మ‌రో ప్ర‌త్యామ్నాయ ఓపెన‌ర్ అందుబాటులో ఉన్నాడ‌ని, వీరు ముగ్గురు అద్భుతంగా రాణిస్తున్నార‌ని చెప్పారు. శిఖ‌ర్ ధావ‌న్ అద్భుతమైన ఆట‌గాడే అయిన‌ప్ప‌టికీ జ‌ట్టులో 15 మందికే చోటు ఉంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా కూర్చోవాలని, ప్రస్తుతానికి ఆ ముగ్గురే మా మొద‌టి ప్రాధాన్య ఓపెనర్లు. అని తెలిపాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

Sanju Samson: ఏ గాయమూ కాకపోయినా ఆసియా కప్-2023 నుంచి ఇంటికి సంజూ శాంసన్‌.. ఎందుకంటే?