Shubman Gill : శుభ్‌మన్ గిల్ మాస్టర్ ఫ్లాన్.. గుజరాత్ ప్లేయర్లతో టీమ్ఇండియాను నింపేస్తున్నాడు.. తనకు ఎదురులేకుండా ఉండేందుకేనా?
శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) నాయకత్వంలోనే భారత జట్టు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనుంది.
IND vs AFG Is this india team or Gujarat team what shubman gills plan
Shubman Gill : ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు అఫ్గానిస్థాన్ తో ఓ టెస్టు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అఫ్గాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోగా.. టెస్టుల్లోనూ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతడిని తప్పించారు. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది.
అఫ్గానిస్థాన్‌తో భారత్ ముల్లన్పూర్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. అయితే.. ఈ 15 మందిలో ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కెప్టెన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ లు ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ తరుపున ఆడుతున్న వారే.
ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ జట్టులోని ప్లేయర్లకు ఎక్కువగా గిల్ ప్రాముఖ్యం ఇచ్చాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వారి బలాలు, బలహీనతలు గిల్ కు బాగా తెలుసునని, అందుకనే అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం వారి సేవలను వినియోగించుకోవాలని గిల్ భావించి ఉంటాడని అంటున్నారు.
వీరిలో ఎడమ చేతి వాటం స్సిన్నర్ మానవ్ సుతార్, పేసర్ గుర్నూర్ బ్రార్ లు తొలిసారి భారత జట్టులో స్థానం దక్కించుకోవడం గమనార్హం.
వన్డేల్లో నలుగురు..
భారత్, అఫ్గాన్ జట్ల మధ్య జూన్ 14 నుంచి 20 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ల కోసం 15 మందితో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇందులో 4 ఆటగాళ్లు ఐపీఎల్లో గుజరాత్‌కు చెందిన వారే (కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ) చోటు దక్కించుకున్నారు.
తన మాటకు ఎదురులేకుండా?
సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు, రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ తన కోటరిని నిర్మించుకునే పనిలో ఉన్నట్లుగా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టును పరిశీలిస్తే అర్థమవుతోంది. దీంతో తనకు ఎదురులేకుండా ఉంటుందని అతడు భావిస్తున్నాడని అంటున్నారు.
🚨 News 🚨
Presenting #TeamIndia‘s squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld
— BCCI (@BCCI) May 19, 2026
గిల్ ఇలా చేయడం వల్ల లాభాల కంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. ఐపీఎల్లో తన కెప్టెన్సీలో ఆటగాళ్లు ఆడడంతో వారి బలాలు, బలహీనతలపై గిల్‌కు స్పష్టత ఉంటుంది. అయితే.. అదే సమయంలో మిగిలిన జట్లలో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ ఆటగాళ్లను సెలక్ట్ చేయడం పోవడం విమర్శలకు తావు ఇస్తోంది. దీని వల్ల చెడు సంకేతం ఆటగాళ్లలో వెళ్లే అవకాశం ఉంది.
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబె
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గూర్నూర్ బ్రార్, హర్ష్ దూబె.
