IND vs AFG : భార‌త్ వ‌ర్సెస్ అఫ్గాన్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి..?

టీ20 ప్ర‌పంచ‌ప్ 2024 సూప‌ర్ 8 ద‌శ‌కు చేరుకుంది.

IND vs AFG : భార‌త్ వ‌ర్సెస్ అఫ్గాన్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి..?

Rain Threat Looms Large

India vs Afghanistan : టీ20 ప్ర‌పంచ‌ప్ 2024 సూప‌ర్ 8 ద‌శ‌కు చేరుకుంది. గ్రూప్‌ ద‌శ‌లోని మ్యాచుల‌కు వ‌రుణుడు ఆటంకాలు క‌లిగించాడు. దీంతో కొన్ని మ్యాచులు ర‌ద్దు అయ్యాయి. ముఖ్యంగా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో పాకిస్తాన్ గ్రూప్ ద‌శ నుంచే ఇంటి బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో సూప‌ర్ 8 ద‌శ‌లో మ్యాచులు స‌జావుగా జ‌ర‌గాల‌ని క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం సూప‌ర్ 8 లోని కొన్ని మ్యాచ్‌ల‌కు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భార‌త్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గురువారం భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్నింగ్‌ట‌న్ ఓవ‌ల్‌లో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అక్యూ వెద‌ర్ ప్ర‌కారం.. మ్యాచ్‌జ‌రిగే రోజు బార్బ‌డోస్‌లో 50 శాతానికి పైగా వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.

Uppal Stadium : స‌మ‌స్య ప‌రిష్కారం.. ఉప్ప‌ల్ స్టేడియం క‌రెంట్ బిల్లు క్లియ‌ర్‌..

మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌లకు ఆరంభం కానుంది. తొలి ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత వ‌ర్షం కురిసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు 60 శాతం ఉంది. మ్యాచ్ ఫ‌లితాన్ని పొంద‌డానికి రెండు జ‌ట్లూ క‌నీసం 5 ఓవ‌ర్లు ఆడాల్సి ఉంటుంది.

సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డే లేదు. అందువ‌ల్ల వ‌ర్షం కార‌ణంగా అఫ్గానిస్తాన్‌, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. ఇదే జ‌రిగితే.. టీమ్ఇండియా సెమీ ఫైన‌ల్ అవ‌కాశాల‌ను ప్ర‌భావితం కావొచ్చు. ఎందుకంటే సూప‌ర్ 8లో భార‌త్ మూడు మ్యాచులు ఆడ‌నుంది. క‌నీసం రెండు మ్యాచుల్లో విజ‌యం సాధిస్తేనే సెమీఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం..!

ఇదిలా ఉంటే.. గ్రూప్ స్టేజీలో ఫ్లోరిడా వేదిక‌గా భార‌త్‌, కెన‌డా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. అప్ప‌టికే భార‌త్ మూడు మ్యాచులు గెల‌వ‌డంతో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయినా టీమ్ఇండియాకు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.