IND vs AUS 1st T20 : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్.. తెలుగోడికి నో ప్లేస్..
తొలి టీ20 మ్యాచ్‌లో (IND vs AUS 1st T20)ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
IND vs AUS 1st T20 Australia won the toss and opt to bowl
IND vs AUS 1st T20 : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
‘మేం తొలుత బౌలింగ్ చేస్తాం. ఇది చాలా మంచి పిచ్. టీ20ల్లో భారత్ నంబర్ 1 జట్టు. రానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం అన్ని జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో తలపడేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం.’ అని మిచెల్ మార్ష్ అన్నాడు.
Ruturaj Gaikwad : డబుల్ సెంచరీ చేసిన పృథ్వీ షాకు నో అవార్డు.. రుతురాజ్ గైక్వాడ్ ఏం చేశాడంటే..?
టాస్ గెలిచినా కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. చూస్తుంటే పిచ్ బాగుంది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో స్లో కావొచ్చునని భావిస్తున్నా. అందుకనే తొలుత బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆటగాళ్లు అందరూ అద్భుతంగా ఆడుతుండడంతో తుది జట్టును ఎంపిక చేయడం కష్టంగా మారిందన్నాడు. అయినప్పటికి ఇదొక శుభపరిణామం అని చెప్పాడు. రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, నితీశ్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదన్నాడు.
భారత తుది జట్టు..
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
Here’s a look at #TeamIndia‘s Playing XI ahead of the 1st T20I 🙌
Updates ▶️ https://t.co/VE4FvHCa1u#AUSvIND pic.twitter.com/UgzNGqFkTS
— BCCI (@BCCI) October 29, 2025
Jos Buttler : ఇయాన్ బెల్‌ను అధిగమించి.. ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకున్న జోస్ బట్లర్..
ఆస్ట్రేలియా తుది జట్టు..
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
