IND vs AUS 2nd ODI : మ‌రోసారి కుల్దీప్ యాద‌వ్‌కు మొండిచేయి.. ఈ రోజు అలా కాద‌ని అనుకుంటున్నా.. శుభ్‌మ‌న్ గిల్‌..

అడిలైడ్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా (IND vs AUS 2nd ODI ) జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది.

IND vs AUS 2nd ODI : మ‌రోసారి కుల్దీప్ యాద‌వ్‌కు మొండిచేయి.. ఈ రోజు అలా కాద‌ని అనుకుంటున్నా.. శుభ్‌మ‌న్ గిల్‌..

IND vs AUS 2nd ODI Australia opt to bowl no place for Kuldeep Yadav

Updated On : October 23, 2025 / 9:31 AM IST

IND vs AUS 2nd ODI : మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిష‌న్స్ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా అత‌డు తెలిపాడు. దీంతో భార‌త్ (IND vs AUS 2nd ODI) తొలుత బ్యాటింగ్ కు దిగింది.

‘టాస్ గెల‌వ‌డం సంతోషంగా ఉంది. మేం బౌలింగ్ చేస్తాం. ఈ మైదానంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నాము. ప్రేక్ష‌కులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. తొలి వ‌న్డేలో గెల‌వ‌డం బాగుంది. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ కైవ‌సం చేసుకోవాల‌ని భావిస్తున్నాం. తుది జ‌ట్టులో రెండు మార్పులు చేశాము. ఫిలిప్‌ స్థానంలో అలెక్స్ క్యారీ, ఎల్లిస్ స్థానంలో గ్జేవియర్ బార్ట్‌లెట్ జట్టులోకి వ‌చ్చారు.’ అని మిచెల్ మార్ష్ తెలిపాడు.

Womens World Cup 2025 : న్యూజిలాండ్‌తో చావో రేవో మ్యాచ్‌.. భారత్‌ ఆ బలహీనతను అధిగమిస్తుందా?

టాస్ గెలిచి ఉంటే తాము కూడా బౌలింగ్ చేసే వాళ్ల‌మ‌ని టీమ్ఇండియా కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్ చెప్పాడు. ‘మేం కూడా తొలుత బౌలింగ్ చేయాల‌ని అనుకున్నాం. అయిన‌ప్ప‌టికి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌డం కూడా ఆనంద‌మే. వ‌ర్షం బ్రేకుల మ‌ధ్య ఆడ‌డం అంత సుల‌భం కాదు. ఈ రోజు మ్యాచ్‌కు వ‌ర్షం వ‌ల్ల అంత‌రాయం క‌ల‌గ‌ద‌ని భావిస్తున్నాం. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ తొలి వ‌న్డేలో ఆడిన టీమ్‌తోనే బ‌రిలోకి దిగుతున్నామ‌ని గిల్ చెప్పాడు.

తుది జ‌ట్టులో మార్పులు లేక‌పోవ‌డంతో స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. తొలి వన్డే మ్యాచ్‌లో ఓట‌మి త‌రువాత‌ కుల్దీప్ యాదవ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మాజీ క్రికెట‌ర్లు సూచించినా టీమ్ మేనేజ్‌మెంట్ ప‌ట్టించుకోలేదు.

భార‌త తుది జ‌ట్టు..

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు..

మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రేన్‌షా, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, మిచెల్ ఓవెన్, గ్జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.