Ind Vs Aus 4th T20 : నాలుగో టీ20లో భారత్ విజయం
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగో టీ20 మ్యాచులో తలపడ్డాయి.

Ind Vs Aus 4th T20
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగో టీ20 మ్యాచులో తలపడ్డాయి.
LIVE NEWS & UPDATES
-
20 పరుగుల తేడాతో భారత్ విజయం
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
-
బెన్ డ్వారిషుస్ క్లీన్ బౌల్డ్..
ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బెన్ డ్వారిషుస్ (1)క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 17.3వ ఓవర్లో 133 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది.
-
మాథ్యూ షార్ట్ ఔట్..
దీపక్ చాహర్ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (22) జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 16.4వ ఓవర్లో 128 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అంతక ముందు టిమ్ డేవిడ్ (19) ఔట్ అయ్యాడు.
-
బెన్ మెక్‌డెర్మోట్ క్లీన్ బౌల్డ్..
ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బెన్ మెక్‌డెర్మోట్ (19) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 11.2వ ఓవర్లో 87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
-
ఆరోన్ హార్డీ క్లీన్‌బౌల్డ్..
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆరోన్ హార్డీ (8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 6.2వ ఓవర్లో 52 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
-
ట్రావిస్ హెడ్ ఔట్..
ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ క్యాచ్ అందుకోవడంతో ట్రావిస్ హెడ్ (31; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 4.4వ ఓవర్లో 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
జోష్ ఫిలిప్ క్లీన్ బౌల్డ్
లక్ష్య ఛేదనలో ఆసీస్‌కు షాక్ తగిలింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో జోష్ ఫిలిప్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 3.1వ ఓవర్‌లో ఆసీస్ 40 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
First ball of his spell and Ravi Bishnoi strikes ⚡️?
He removes Josh Philippe for 8.
Follow the Match ▶️ https://t.co/iGmZmBsSDt#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/ccQxDKoeiw
— BCCI (@BCCI) December 1, 2023
-
20 ఓవర్లకు భారత స్కోరు 174/9
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రింకూ సింగ్ (46; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) యశస్వి జైస్వాల్ (37; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్), జితేశ్ శర్మ (35; 19 బంతుల్లో 1 ఫోర్, 3సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వారిషుస్ మూడు వికెట్లు తీశాడు. తన్వీర్ సంఘ, జాసన్ బెహ్రెండోర్ఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీ ఓ వికెట్ సాధించాడు.
Innings break!
Rinku Singh top-scores with 46 as #TeamIndia set a ? of 175 ?
Second innings coming up shortly ⏳
Scorecard ▶️ https://t.co/iGmZmBsSDt#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/4q17vMLbBi
— BCCI (@BCCI) December 1, 2023
-
రుతురాజ్ గైక్వాడ్ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. తన్వీర్ సంఘ బౌలింగ్‌లో బెన్ ద్వార్షుయిస్ క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 13.2వ ఓవర్లో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
-
సూర్యకుమార్ యాదవ్ ఔట్..
బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ క్యాచ్ అందుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (1) ఔట్ అయ్యాడు. దీంతో 8.1వ ఓవర్‌లో భారత్ 63 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
-
శ్రేయస్ అయ్యర్ ఔట్..
భారత్ మరో వికెట్ కోల్పోయింది. తన్వీర్ సంఘ బౌలింగ్‌లో క్రిస్ గ్రీన్ క్యాచ్ అందుకోవడంతో శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 7.5వ ఓవర్లో 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
యశస్వి జైస్వాల్ ఔట్..
ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (37; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)మెక్‌డెర్మాట్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 5.6వ ఓవర్లో 50 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు భారత స్కోరు 50/1. రుతరాజ్ (7), శ్రేయస్ అయ్యర్ (0) లు ఆడుతున్నారు,.
-
5 ఓవర్లకు భారత స్కోరు 43/0
టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. జైస్వాల్ (32), రుతురాజ్ (6)లు ఆడుతున్నారు.
-
ఆస్ట్రేలియా తుది జట్టు
జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(కెప్టెన్), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ
-
భారత తుది జట్టు
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
A look at #TeamIndia’s Playing XI for the 4th T20I ????
Follow the Match ▶️ https://t.co/iGmZmBsSDt#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/DgHpRsNjyS
— BCCI (@BCCI) December 1, 2023
-
టాస్..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
? Toss Update ?
Australia win the toss and elect to bowl in Raipur.
Follow the Match ▶️ https://t.co/iGmZmBsSDt#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/GD0PhQIepF
— BCCI (@BCCI) December 1, 2023