IND vs BAN: ఉప్పల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. తొలి రెండు టీ20 మ్యాచుల్లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.
ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా నేటి మ్యాచులోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మూడో టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లా అనుకుంటోంది. ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి.
ఉప్పల్ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. ఇవాళ జల్లులు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఉప్పల్‌లో మ్యాచ్ ఉండడంతో పోలీసులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉండడంతో ఇవాళ అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు బయలుదేరుతాయి.