IND vs ENG: ఓరి మీ దుంపలు తెగ.. ఎంత కోపముంటే మాత్రం ఇలా కొట్టాలా..! బంతితో ఫీల్డర్‌ను కొట్టాడు.. వీడియో వైరల్ ..
భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్‌లో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, రెండోరోజు మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Also Read: IND vs ENG: బుమ్రాతో అట్లే ఉంటది మరి..! ఇంగ్లాండ్ ఓపెనర్లకు మైండ్ బ్లాకైంది.. వీడియో వైరల్
భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో షోయబ్ బషీర్ వేసిన 98వ ఓవర్‌లో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో చివరి బంతిని రిషబ్ పంత్ షార్ట్ థర్డ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీశారు. బంతిని అందుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ కీపర్ వైపు బలంగా విసిరాడు. కానీ, బంతి మధ్యలోఉన్న హ్యారి బ్రూక్ కు బలంగా తాకింది.
హ్యారీ బ్రూక్ పక్కటెముకల భాగంలో బంతి బలంగా తాకడంతో అతను కిందపడిపోయాడు. బలంగా ఊపిరిపీల్చుకున్నాడు. పెద్దగా గాయం కాకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా వ్యక్తిగత కోపం ఉంటే బయట చూపించుకోవాలి కానీ.. గ్రౌండ్‌లో ఇలాచేస్తే ఎలా బ్రో..! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) June 21, 2025