IND vs ENG 1st Test day 1 : ముగిసిన తొలి రోజు ఆట‌

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆరంభ‌మైంది.

IND vs ENG 1st Test day 1 : ముగిసిన తొలి రోజు ఆట‌

IND vs ENG 1st Test day 1

Updated On : January 25, 2024 / 4:57 PM IST

ముగిసిన తొలి రోజు ఆట‌
తొలి రోజు ఆట ముగిసింది. భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టపోయి 119 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) లు క్రీజులో ఉన్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌..
భార‌త్ మొద‌టి వికెట్‌ను కోల్పోయింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (24) ఔట్ అయ్యాడు. దీంతో 12.2వ ఓవ‌ర్‌లో 80 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ తొలి వికెట్ న‌ష్ట‌పోయింది.

య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ..
యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఈ క్ర‌మంలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ 246 ఆలౌట్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ బెన్‌స్టోక్స్ (70; 88 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. జానీ బెయిర్ స్టో (37), బెన్‌డ‌కెట్ (35), జో రూట్ (29)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, అక్ష‌ర్ ప‌టేల్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

మార్క్‌వుడ్ క్లీన్‌బౌల్డ్‌..
అశ్విన్ బౌలింగ్‌లో మార్క్‌వుడ్ క్లీన్ బౌల్డ్ (11) అయ్యాడు. దీంతో 61.3వ ఓవ‌ర్‌లో 234 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది

టీ బ్రేక్‌.. 
మొద‌టి రోజు ఆట‌లో టీ విరామానికి ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 215 ప‌రుగులు చేసింది. బెన్ స్టోక్స్ (43), మార్క్ వుడ్ (7) లు ఆడుతున్నారు.


టామ్ హార్ట్లీ క్లీన్‌బౌల్డ్‌..
ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో టామ్ హార్ట్లీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 193 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

రెహాన్ అహ్మద్ ఔట్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ కేఎస్ భ‌ర‌త్ క్యాచ్ అందుకోవ‌డంతో రెహాన్ అహ్మద్ (13) ఔట్ అయ్యాడు. దీంతో 48.3వ ఓవ‌ర్‌లో 155 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది

బెన్ ఫోక్స్ ఔట్‌..
అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో శ్రీక‌ర్ భ‌ర‌త్ క్యాచ్ అందుకోవ‌డంతో బెన్ ఫోక్స్ (4) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 42.5వ ఓవ‌ర్‌లో 137 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

జోరూట్ ఔట్‌.. 
ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ అందుకోవ‌డంతో జో రూట్ (29) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 35.3వ ఓవ‌ర్‌లో 125 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

బెయిర్ స్టో క్లీన్ బౌల్డ్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో బెయిర్ స్టో (37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 32.4వ ఓవ‌ర్‌లో 121 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది

లంచ్ బ్రేక్‌.. 
మొద‌టి రోజు లంచ్ స‌మ‌యానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 108 ప‌రుగులు చేసింది. బెయిర్ స్టో (32), జో రూట్ (18)లు క్రీజులో ఉన్నారు.

జాక్ క్రాలీ ఔట్‌..
ర‌విచంద్ర‌న్ అశ్విన్ బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ క్యాచ్ అందుకోవ‌డంలో జాక్ క్రాలీ(20) ఔట్ అయ్యాడు. దీంతో 15.1వ ఓవ‌ర్‌లో 60 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది.

ఓలీపోప్ ఔట్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో ఓలీపోప్ (1) ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 14.4వ ఓవ‌ర్‌లో రెండో వికెట్ కోల్పోయింది.

తొలి వికెట్ అశ్విన్‌కే..
ఇంగ్లాండ్ మొద‌టి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో (11.5వ ఓవ‌ర్‌)లో బెన్ డ‌కెట్ (35) ఎల్బీ ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 55 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

8 ఓవ‌ర్ల‌కు 41/0
ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. త‌మ‌దైన బ‌జ్‌బాల్ శైలిలోనే బ్యాటింగ్ కొన‌సాగిస్తున్నారు. 8 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 41/0. జాక్ క్రాలి (16), బెన్ డ‌కెట్ (23) లు క్రీజులో ఉన్నారు.

భారత తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.


ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, అలీపోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టో్క్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.