Ind Vs Eng 1st Test : తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పరాజయం.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం

Ind Vs Eng 1st Test : లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేజ్ చేసింది. 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీ కొట్టింది. 82 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ సెంచరీతో చెలరేగాడు. 170 బంతుల్లోనే 149 పరుగులు బాదాడు. 21 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు డకెట్.
జాక్ క్రాలె(65), జో రూట్(53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జేమీ స్మిత్(44), బెన్ స్టోక్స్ (33) రాణించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్ లో భారత్ 471 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కినా.. బౌలర్లు, ఫీల్డర్ల వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్ ను చేతులారా వదిలేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్(137), రిషబ్ పంత్ (118) శతకాలు చేసినా.. భారత్ కు ఓటమి తప్పలేదు.
Also Read: పాక్ ఆటగాడితో ఇషాన్ కిషన్ సంబురాలు.. వీడియో వైరల్..