Joe Root : అరుదైన రికార్డుపై జో రూట్ క‌న్ను.. విశాఖ టెస్టులో అందుకునేనా..?

ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Joe Root : అరుదైన రికార్డుపై జో రూట్ క‌న్ను.. విశాఖ టెస్టులో అందుకునేనా..?

IND vs ENG Joe Root eyes historic landmark in Vizag Test

Joe Root : ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జో రూట్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. విశాఖ వేదిక‌గా శుక్ర‌వారం నుంచి భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచులో అత‌డు 138 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 19 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఇంగ్లాండ్ ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఓవ‌రాల్‌గా 14వ బ్యాట‌ర్‌గా నిలనున్నాడు. రూట్ ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 339 మ్యాచులు ఆడాడు. 48.24 స‌గ‌టుతో 66.41 స్ట్రైక్‌రేటుతో 18,862 ప‌రుగులు చేశాడు. ఇందులో 46 శ‌త‌కాత‌లు, 104 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 34,357 ప‌రుగుల‌తో స‌చిన్ ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌, కుమార సంగ‌క్క‌ర‌, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, మ‌హేలా జ‌య‌వ‌ర్ధ‌నే, జాక్వెస్ క‌లిస్‌, రాహుల్ ద్రవిడ్‌, బ్రియాన్ లారా, స‌న‌త్ జ‌య‌సూర్య‌, చంద్ర‌పాల్‌, ఇంజ‌మామ్ ఉల్ హ‌క్‌, ఏబీ డివిలియ‌ర్స్‌, క్రిస్‌గేల్ లు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 19 వేలకు పైగా ప‌రుగులు సాధించారు.

Ashwin : విశాఖ టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న రికార్డులు ఏంటో తెలుసా..?

బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైనా..
ఇక రూట్ విష‌యానికి వ‌స్తే.. హైద‌రాబాద్ వేదిక‌గా ఉప్ప‌ల్‌లో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో రూట్ విఫ‌లం అయ్యాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 60 బంతులు ఎదుర్కొన్న రూట్ కేవ‌లం ఓ ఫోర్ బాది 29 ప‌రుగులు చేసి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 6 బంతులు ఆడి కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

బ్యాటింగ్‌లో విఫ‌లం అయిన‌ప్ప‌టికి బౌలింగ్‌లో అత‌డు స‌త్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రూట్ రెండో ఇన్నింగ్స్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజ‌యంలో కీల‌క పాత్ర వ‌హించాడు. రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూలం అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో రూట్ బౌలింగ్‌ను భార‌త బ్యాట‌ర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే

IND vs ENG 2nd Test : అదే వ్యూహాన్ని న‌మ్ముకున్న ఇంగ్లాండ్‌.. రెండో టెస్టుకు తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వా..!