IND vs SA 1st Test Match : టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్.. నెట్స్‌లో చమటోడ్చిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

టీమిండియా సౌతాఫ్రికాలో రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు 26న సెంచూరియన్‌లో ప్రారంభమవుతుంది. 26 నుంచి 30వరకు తొలి టెస్టు జరుగుతుంది.

IND vs SA 1st Test Match : టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్.. నెట్స్‌లో చమటోడ్చిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్

Captain Rohit Sharma

Updated On : December 25, 2023 / 8:14 AM IST

India vs South Africa Test Series : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. మొదటి టెస్టు మ్యాచ్ కు టీమిండియా ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. మైదానంలో కసరత్తు చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిస్థాయిలో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తాత్కాలికంగా విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. దీంతో ఆదివారం నెట్స్ లో వీరు చెమటోడ్చారు.

Also Read : Shubman Gill : ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ల‌కు గిల్ హెచ్చ‌రిక‌లు..! సింహంతో సెల్ఫీ తీసుకుని..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్ లో భిన్నమైన పిచ్ లపై బౌలర్లను, త్రోలను ఎదుర్కొన్నారు. ఇద్దరూ బ్యాటింగ్ సాధనపైనే పూర్తిగా దృష్టిసారించారు. సుమారు 3గంటల పాటు వీరి నెట్ ప్రాక్టీస్ సాగింది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షించారు. మరోవైపు కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగా.. యశస్వీ జైశ్వాల్, గిల్ స్లిప్ క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. టెస్టు సిరీస్ కు సమయం దగ్గర పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు అని పేర్కొంది.

ఇదిలాఉంటే.. టీమిండియా సౌతాఫ్రికాలో రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు 26న సెంచూరియన్‌లో ప్రారంభమవుతుంది. 26 నుంచి 30వరకు తొలి టెస్టు జరుగుతుంది. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

Also Read : IND vs SA 1st Test : కోహ్లీ వచ్చేశాడు.. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టుకు అందుబాటులో విరాట్