IND vs SA : విశాఖలో శతక్కొట్టిన క్వింటన్ డికాక్.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే?
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగాడు.
IND vs SA 3rd ODI Quinton de Kock century Team India target is 271
IND vs SA : విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఇక దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 271 పరుగుల లక్ష్యం నిలిచింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో డికాక్ కాకుండా కెప్టెన్ టెంబా బవుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మాథ్యూ బ్రీట్జ్కే (24) లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా. అర్ష్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
South Africa are all out for 2⃣7⃣0⃣ in Vizag
Prasidh Krishna with the final wicket of the innings 😎
He finishes with a four-wicket haul 🙌
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/5mays2y5uS
— BCCI (@BCCI) December 6, 2025
