WI vs IND 1ST Test : అదరగొడుతున్న యశస్వీ జైస్వాల్.. అభినందించిన జై షా.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

WI vs IND 1ST Test : అదరగొడుతున్న యశస్వీ జైస్వాల్.. అభినందించిన జై షా.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

WI vs IND 1ST Test

WI vs IND 1ST Test Match : డొమినికా వేదిక‌గా భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలోనూ టీమిండియానే పైచేయి సాధించింది. తొలిరోజు ఆటలో వెస్టిండీస్ జ‌ట్టును 150 ప‌రుగుల‌కే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేయగా.. రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ సెంచరీల మోతమోగించారు. ఓవర్ నైట్ స్కోర్ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లు.. తొలి సెషన్‌లో కొంచెం నెమ్మదిగా ఆడారు ఫలితంగా వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తరువాత దూకుడుగా ఆడుతూ భారత్ స్కోర్ ను పరుగు పెట్టించారు. ఈ క్రమంలోనే ఓపెనర్లు ఇద్దరు సెంచరీలతో కదంతొక్కారు.

WI vs IND 1ST Test : భారత్ భారీ స్కోర్.. విండీస్‌పై సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు.. UPDATES

లంచ్ తరువాత మెరుపు షాట్లు ఆడి యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు. 215 బంతుల్లో వంద పరుగులు చేశాడు. ఆ తరువాత రోహిత్ శర్మ కూడా 220 బంతుల్లో 103 పరుగులు చేశాడు. తద్వారా టెస్టుల్లో తన పదో శతకాన్ని పూర్తిచేశాడు. సెంచరీ పూర్తయిన మరుసటి బంతికే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శుభ్‍మన్ గిల్ కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (36 నాటౌట్), యశస్వీ జైస్వాల్‌ (143 నాటౌట్) తో కలిసి నెమ్మదిగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 312/2 పరుగులు చేసింది.

WI vs IND Test Match: తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం.. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలం.. తక్కువ స్కోర్‌కే కుప్పకూలిన వెస్టిండీస్ ..

యశస్వీ జైస్వాల్‌ను అభినందించిన జై షా..

అరంగ్రేటం టెస్టు మ్యాచ్‌లోనే యశస్వీ జైస్వాల్‌ సెంచరీ చేశాడు. దీంతో అతన్ని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా అభినందించారు. అరంగ్రేటం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేయడంతో అభినందనీయం అన్నారు. వెస్టిండీస్ పై అరంగ్రేటంలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్సుడైన భారత ఆటగాడు కావటం నిజంగా అద్భుతం. అద్భుతమైన ప్రతిభ, సంకల్పం, భవిష్యత్తు కోసం వాగ్దానంతో నిండిన ఇన్నింగ్స్. జైస్వాల్ కు అభినందనలు అంటూ జైషా ట్వీట్ చేశారు.

 

 

రికార్డుల మోత..

– ఈ టెస్టు ద్వారా ఆసియా అవతల టెస్టుల్లో తొలి వికెట్‌కు భారత్ సాధించిన అత్యధిక పరుగులు (రోహిత్- యశస్వీ 229) ఇవే కావటం గమనార్హం. 1979లో ఇంగ్లాండ్ జట్టుపై చేతన్ చౌహాన్ – గవాస్కర్ 213 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఆ రికార్డును రోహిత్ శర్మ – యశస్వీ జైస్వాల్ బద్దలు కొట్టారు.
– అరంగ్రేటం టెస్టులోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు. విదేశీ గడ్డపై ఓపెనర్‌గా అరంగ్రేటంలో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
– ఒక్క వికెట్ కోల్పోకుండానే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకోవడం భారత్ జట్టుకు ఇదే తొలిసారి.
– అరంగ్రేటంలోనే సెంచరీ సాధించిన పదిహేడో భారత బ్యాటర్ యశస్వీ. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన మూడో ఓపెనర్ యశస్వీ జైస్వాల్.