IND vs WI : వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. యశస్వి, గిల్ భారీ శతకాలు.. భారత్ 518/5 డిక్లేర్డ్..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.

IND vs WI 2ND Test team india declared 1st innings 518_5
IND vs WI : ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ను భారత్ 518/5 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) భారీ శతకాలు బాదారు. సాయి సుదర్శన్ (87) హాఫ్ సెంచరీ చేయగా, నితీశ్‌కుమార్ రెడ్డి (43), ధువ్ జురెల్ (44), కేఎల్ రాహుల్ (38) లు రాణించారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ సాధించాడు.
200 పరుగులు మూడు వికెట్లు..
ఓవర్ నైట్ స్కోరు 318/2 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో మూడు వికెట్లు కోల్పోయి ఇంకో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.
రెండో రోజు ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు భారీ శతకం చేసిన యశస్వి జైస్వాల్ రెండో రోజు సాధికారికంగానే మొదలు పెట్టాడు. అయితే.. ఓవర్ నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించిన అతడు దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. గిల్‌తో సమన్వయలోపం కారణంగానే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Innings Break!#TeamIndia have declared on a mammoth 5⃣1⃣8⃣/5⃣
1⃣7⃣5⃣ for Yashasvi Jaiswal
1⃣2⃣9⃣* for Captain Shubman Gill
8⃣7⃣ for Sai SudharsanOn to our bowlers now 🙌
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/kVT7lUpHwm
— BCCI (@BCCI) October 11, 2025
ఆ తరువాత తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. 54 బంతుల్లో 43 రన్స్ చేశాడు. వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన గిల్ క్రీజులో కుదురుకున్నాక వేగం పెంచాడు. పియరి బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి టెస్టుల్లో 10వ సెంచరీ సాధించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ (44) కూడా వేగంగా ఆడాడు. హాఫ్ సెంచరీకి ఆరు రన్స్ దూరంలో జురెల్ ఔట్ అయ్యాడు. అతడు ఔట్ కాగానే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.