Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ రికార్డు బ్రేక్.. డబ్ల్యూటీసీలో సెంచరీల కింగ్ ..
టీమ్ఇండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అరుదైన ఘనత సాధించాడు.

Shubman Gill creates history MOST HUNDREDS FOR INDIA IN WTC
Shubman Gill : ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ శతకంతో చెలరేగాడు. ఖరీ పియర్ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 177 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ బాది మూడు అంకెల స్కోరు సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కాగా.. కెప్టెన్‌గా భారత గడ్డ పై తొలి సెంచరీ కావడం గమనార్హం.
కాగా.. ఈ క్రమంలోనే గిల్ (Shubman Gill ) ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్ డబ్ల్యూటీసీలో 9 శతకాలు చేయగా గిల్ 10 సెంచరీలు చేశాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* శుభ్‌మన్ గిల్ – 10 సెంచరీలు
* రోహిత్ శర్మ – 9 సెంచరీలు
* యశస్వి జైస్వాల్ – 7 శతకాలు
* రిషబ్ పంత్ – 6 శతకాలు
* కేఎల్ రాహుల్ – 6 శతకాలు
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు టెస్టు శతకాలు..
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు శతకాలు సాధించిన ఆటగాళ్లు జాబితాలో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లీ ఈ ఘనతను 2017, 2018 సీజన్లలో నమోదు చేశాడు.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు టెస్టు శతకాలు చేసిన భారత కెప్టెన్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 2017లో
* విరాట్ కోహ్లీ – 2018లో
* శుభ్‌మన్ గిల్ – 2025లో
సునీల్ గవాస్కర్, కుక్ తరువాత..
కెప్టెన్‌గా 5 టెస్టు సెంచరీలను అత్యంత వేగంగా చేసిన ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో నిలిచాడు. అతడి కన్నా ముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కుక్, భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌లు ఉన్నారు. కుక్ 9 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయగా, గవాస్కర్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక శుభ్‌మన్ గిల్ విషయానికి వస్తే.. 12 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
కెప్టెన్‌గా అత్యంత వేగంగా 5 సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 9 ఇన్నింగ్స్‌లు
* సునీల్ గవాస్కర్ (భారత్) – 10 ఇన్నింగ్స్‌లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 12 ఇన్నింగ్స్‌లు