IND vs AUS 5th T20 : బెంగ‌ళూరులో భార‌త్‌ విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం

India vs Australia 5th T20 : నామ‌మాత్ర‌మైన ఆఖ‌రి టీ20 మ్యాచులోనూ భార‌త్ విజ‌యం సాధించింది.

IND vs AUS 5th T20 : బెంగ‌ళూరులో భార‌త్‌ విజ‌యం.. 4-1తో సిరీస్ కైవ‌సం

IND vs AUS 5th T20

నామ‌మాత్ర‌మైన ఆఖ‌రి టీ20 మ్యాచులోనూ భార‌త్ విజ‌యం సాధించింది. త‌ద్వారా 4-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. బెంగ‌ళూరు వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టీ20 మ్యాచులో భార‌త్ 6 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో బెన్ మెక్‌డెర్మాట్ (54; 36 బంతుల్లో 5 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం బాదాడు.

ట్రావిస్ హెడ్ (28), మాథ్యూవేడ్ (22), టిమ్ డేవిడ్ (17)లు ఓ మోస్త‌రుగా రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ర‌వి బిష్ణోయ్ చెరో రెండు తీయ‌గా అక్ష‌ర్ ప‌టేల్‌లు ఓ వికెట్ సాధించాడు.

Shaheen Afridi : ఆ కార‌ణం చేత‌నే బ్యాగులు మోశాం.. లేదంటేనా..? : పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 ప‌రుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. అక్ష‌ర్ ప‌టేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), జితేశ్ శ‌ర్మ (24), య‌శ‌స్వి జైస్వాల్ (21) లు రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో బెన్ డార్వాయిస్‌, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.