Womens Asia Cup 2023 : ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్
ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023(WomensEmergingTeamsAsiaCup) ఛాంపియన్‌గా టీమ్ఇండియా అవతరించింది. శ్వేతా సెహ్రావత్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు ఫైనల్లో బంగాదేశ్ను ఓడించి మొట్టమొదటి మహిళల ఎమర్జింగ్ ఆసియా విజేతగా నిలిచింది.

India beat Bangladesh
Womens Asia Cup : ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023(WomensEmergingTeamsAsiaCup) ఛాంపియన్‌గా టీమ్ఇండియా అవతరించింది. శ్వేతా సెహ్రావత్ సారథ్యంలోని ఇండియా ఎ జట్టు ఫైనల్లో బంగాదేశ్ను ఓడించి మొట్టమొదటి మహిళల ఎమర్జింగ్ ఆసియా విజేతగా నిలిచింది. హాంకాంగ్‌లోని మోంగ్ కోక్‌లోని మిషన్ రౌండ్ గ్రౌండ్లో జూన్ 21న (బుధవారం) జరిగిన ఫైనల్లో భారత్ 31 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ సెహ్రావత్(13), ఉమా చెత్రీ (20) తక్కువ స్కోరుకే ఔటైనప్పటికి దినేష్ బృందా 29 బంతుల్లో 36 పరుగులు, కనికా అహుజా 23 బంతుల్లో 30పరుగులతో రాణించడంతో బంగ్లా ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. శ్రేయాంక పాటిట్ పాటిల్ నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా మన్నత్ కశ్యప్ మూడు, కనిజా అహుజా రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో నహీదా అక్తర్ 17 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
?. ?. ?. ?. ?. ?. ?. ?. ?! ?
Congratulations to India ‘A’ on the title triumph ? ? #WomensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/OCaw8cvHLS
— BCCI Women (@BCCIWomen) June 21, 2023
రెండే మ్యాచులు ఆడిన భారత్
హాంకాంగ్ వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ టోర్నీలో చాలా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. భారత్ లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఆడింది. తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ తలపడింది. హాంకాంగ్‌ను 34 పరుగులకే ఆలౌట్ చేసి లక్ష్యాన్ని 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. థాయ్‌లాండ్, పాకిస్థాన్లతో ఆడాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. సెమీస్ కూడా రద్దు కావడంతో లీగ్ దశలో టాపర్‌గా ఉన్న భారత్ ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
Virat Kohli : జిమ్‌లో కోహ్లి వర్కౌట్లు.. సాకులు వెదుకుతూనే ఉంటారా..? మరింత మెరుగవుతారా..?