Ind Vs NZ: న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టు..

బ్యాట్‌తో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటివరకు 45 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు.

Ind Vs NZ: న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టు..

India Vs New Zealand Pic Credit @ Espn Cric Info

Updated On : January 12, 2026 / 12:06 AM IST
  • వన్డే సిరీస్ లో భారత్ బోణీ
  • తొలి వన్డేలో ఘన విజయం
  • 20 సార్లు 300+ టార్గెట్స్ చేజింగ్
  • ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డ్

 

Ind Vs NZ: న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ పై ఘన విజయం సాధించింది. 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే ఛేదించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 91 బంతుల్లో 93 పరుగులు చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 8 ఫోర్లు ఉన్నాయి. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. గిల్‌తో (56) కలిసి కీలకమైన 118 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టు విజయంలో తన పాత్ర పోషించాడు. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు.

హర్షిత్ రాణా బ్యాటింగ్ 23 బంతుల్లో 29 పరుగులతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 21 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టుకి విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. 300 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదిస్తూ 20 గేమ్స్ లో గెలిచిన ప్రపంచంలోనే తొలి జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది భారత్. ఇంగ్లాండ్ తర్వాతి స్థానంలో ఉంది. ఒకప్పుడు వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత్ 15 సార్లు 300+ లక్ష్యాలను ఛేదించింది.

ఆస్ట్రేలియా ఇలా 14 సార్లు చేసింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్టుగా నిలిచిన ఆసీస్ వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్‌లను (1999, 2003, 2007లో.) గెలుచుకుంది. 2006లో దక్షిణాఫ్రికాపై మొత్తం 434 పరుగులు చేసి వన్డేల్లో 400 పరుగులు చేసిన తొలి జట్టుగా కూడా నిలిచింది. కాగా, దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించి, తద్వారా అదే రోజు ఈ ఘనత సాధించిన రెండవ వన్డే జట్టుగా నిలిచింది.

బ్యాట్‌తో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటివరకు 45 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. ఎలైట్ జాబితాలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య తర్వాత ఉన్నాడు. సచిన్ వన్డేల్లో 62 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకోగా, జయసూర్య 48 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించేలోపు ఈ లిస్ట్ లో శ్రీలంక దిగ్గజాన్ని అధిగమించొచ్చు.

300 ప్లస్ టార్గెట్స్ ను చేజ్ చేసిన జట్లు ఇవే..
భారత్ – 20 సార్లు
ఇంగ్లాండ్ – 15 సార్లు
పాకిస్తాన్ – 12 సార్లు
న్యూజిలాండ్, శ్రీలంక – 11 సార్లు

Also Read: వారెవ్వా.. విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు.. సచిన్ రికార్డును మించిపోయి..