Sri Lanka vs India: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బౌలింగ్!

ఎన్నో కష్టాలు, కరోనా ఎదురీతల మధ్య శ్రీలంకతో సమరానికి సిద్ధం అయ్యింది భారత్.. చెరొక పాయింట్ ఖాతాలో వేసుకుని ఆఖరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది.

Sri Lanka vs India: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బౌలింగ్!

Dhavan

Updated On : July 29, 2021 / 8:05 PM IST

Sri Lanka vs India, 3rd T20I- ఎన్నో కష్టాలు, కరోనా ఎదురీతల మధ్య శ్రీలంకతో సమరానికి సిద్ధం అయ్యింది భారత్.. చెరొక పాయింట్ ఖాతాలో వేసుకుని ఆఖరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగింది.

ఈ క్రమంలోనే టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుని శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మరోవైపు వన్డే సిరీస్ ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్‌‌లో విజయంతో టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని యోచిస్తుంది. దాంతో ఈ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠగా మారింది.

అయితే, ఇప్పటికే హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా లాంటి ప్లేయర్లను దూరం చేసుకున్న భారత్.. గత మ్యాచ్‌లో గాయపడడంతో నవ్‌దీప్‌సైనిని కూడా దూరం చేసుకుంది. నవ్‌దీప్‌సైని స్థానంలో సందీప్‌ వారియర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా (Playing XI): శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ రాణా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రాహుల్‌ చాహర్‌, సందీప్‌ వారియర్‌, చేతన్‌ సకారియా, వరుణ్‌ చక్రవర్తి

శ్రీలంక (Playing XI): అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, సందీర సమరవిక్రమ, పాతుమ్‌ నిస్సంక, డాసున్‌ శనక (కెప్టెన్‌), ధనంజయ డిసిల్వ, వానిండు హసరంగ, రమేశ్‌ మెండిస్‌, చామిక కరుణరత్నె, అఖిల ధనంజయ, దుష్మంత చమీరా