IND vs AUS T20 : ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వారికి దక్కని చోటు.. ఏరోజు ఎక్కడ మ్యాచ్ జరుగుతుందంటే?
ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

suryakumar yadav
Suryakumar Yadav : ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టుపై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్ జట్టు నిలిచింది. మెగా టోర్నీ తరువాత భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య మొత్తం ఐదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఐదు మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. రోహిత్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. తాజాగా జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు.
వారికి మొండి చేయి ..
ఏడిదిగా టీ20ల్లో జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్ టోర్నీనుంచి పాండ్య తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ కు అందుబాటులో లేకపోవటంతో బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ మూడు టీ20 మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్ లకు అతను వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇదిలాఉంటే.. ముస్తాక్ అలీ ట్రోపీలో అదరగొట్టిన రియాన్ పరాగ్ తో పాటు వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
Also Read : Australia : ఏపీకి రానున్న ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
టీ20 జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
షెడ్యూల్ ఇలా..
- 23న తొలి మ్యాచ్ (విశాఖపట్టణం)
- 26న రెండో మ్యాచ్ (తిరువనంతపురం)
- 28న మూడో మ్యాచ్ (గౌహతి)
- డిసెంబర్ 1న నాల్గో మ్యాచ్ (రాయ్ పూర్)
- డిసెంబర్ 3న ఐదో మ్యాచ్ (బెంగళూరు)
? NEWS ?#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
Details ? #INDvAUShttps://t.co/2gHMGJvBby
— BCCI (@BCCI) November 20, 2023