India tour of Australia 2020 : వహ్వా రహానే, టీమిండియా 277/5

India tour of Australia 2020 : వహ్వా రహానే, టీమిండియా 277/5

Updated On : December 27, 2020 / 4:27 PM IST

India Vs Australia: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే…వహ్వా అనిపించుకున్నాడు. సెంచరీతో అదరగొట్టాడు. 195 బంతులను ఎదుర్కొన్న ఇతను..11 ఫోర్లు సాధించి..100 పరుగులు సాధించాడు. తన టెస్టు కెరీర్‌లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి…277 పరుగులు చేసింది. మొత్తంగా..తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల అధిక్యంలో నిలిచింది.

ఓవర్ నైట్ 36/1 స్కోరుతో రెండో ఆటను భారత జట్టు ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన గిల్..రాణిస్తూ..హాఫ్ సెంచరీ వైపుకు దూసుకెళుతున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 17 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కూడా అవుట్ అయ్యాడు. టీమిండియా 64 పరుగుల వద్ద ప్రధాన వికెట్‌ను కోల్పోయినట్లు అయ్యింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విహారితో కలిసిన..రహానే..మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు.

మరో వికెట్ పడకుండా…జాగ్రత్తగా ఆడారు. 21 పరుగులు చేసిన హనుమ..లయన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. పంత్..రహానేకు సహకరిస్తూ కనిపించినా..29 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 173 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..రహానే..పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో..సెంచరీ సాధించాడు. రహానే 104,..జడేజా 40..ఆచితూచి ఆడుతూ..స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. మొత్తంగా..91.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా…277 పరుగులు చేసింది.