మనమే టాప్: ఆస్ట్రేలియాపై భారత టీ20ల చరిత్ర

ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కొద్ది రోజుల ముందు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఏడు మ్యాచ్‌లు భారత జట్టుకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు కోసం కెప్టెన్ ప్రయోగాలు చేయాల్సింది ఈ మ్యాచ్‌లలోనే. చివరిసారిగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ, టీ20 ఫార్మాట్‌ను మాత్రం టైగానే ముగించింది. మరోసారి అదే ఆధిక్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్న భారత్.. ఏ పాటికి రాణిస్తుందో.. సొంతగడ్డపై రాబట్టలేని విజయాన్ని భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో సాధించాలనుకుంటున్న ఆసీస్ ఎంతవరకూ సఫలమవగలదో చూడాలి.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దూసుకుపోతున్న టీమిండియా.. ఆస్ట్రేలియా జట్టుతో ఆడి గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే..
- ఆసీస్-భారత్‌ల మధ్య జరిగిన 19 టీ20ల్లో ప్రతిసారి హోరాహోరీ పోరు కనిపించింది. వీటిలో ఆస్ట్రేలియా కేవలం 6 సిరీస్‌లలోనే గెలుపొందగా మిగిలిందంతా భారత్ హవానే నడిచింది. 2017 అక్టోబరు 13 నుంచి జరుగుతోన్న టీ20లలో దాదాపు 1-1డ్రాగానే మ్యాచ్‌లు ముగిసిపోతున్నాయి.
- 2013 అక్టోబరు 10 టీ20 చరిత్రలో అదో గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆస్ట్రేలియా జట్టుపై మండిపాటుతో 35బంతుల్లోనే 77పరుగులు రాబట్టాడు సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్. దాంతో జట్టు స్కోరు 202/4కు చేరింది. రాజ్ కోట్ వేదికగా చేదనకు దిగిన టీమిండియా ఇంకా 2బంతులు మిగిలి ఉండగానే విజయం చేజిక్కించుకుంది.
- 2008 ఫిబ్రవరి 1న మెల్బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 74పరుగులకే 17.3 ఓవర్లు ఆడి ఆల్ అవుట్ అయింది. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే 26 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో మైకేల్ క్లార్క్ కెప్టెన్‌గా ఉన్న ఆసీస్ జట్టే విజేతగా నిలిచింది.
- కెప్టెన్ గా కొనసాగుతూనే పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ..14 టీ20 మ్యాచ్‌లు ఆడి 488పరుగులు చేశాడు. ఈ రెండు జట్లలో జస్ప్రిత్ బుమ్రా మాత్రమే అత్యధికంగా 12 వికెట్లు తీసి ఘనత సాధించాడు.
- మెరుపు వేగంతో వికెట్లు తీసే మహేంద్రుడు ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 2012లో మెల్బౌర్న్ వేదికగా జరిగిన సిరీస్‌లో (9 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు) కలిపి 14 వికెట్లు తీయడానికి కారణమయ్యాడు.
ఆస్ట్రేలియాతో రాబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో కోహ్లీ 500 టీ20పరుగులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. బుమ్రా మరో 2 వికెట్లు తీసి రవిచంద్రన్ అశ్విన్ 50వికెట్ల రికార్డుకు చేరువై రెండో స్థానంలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు.