India VS England : రూట్‌ ఆటే హైలెట్‌

ఇండియాతో మ్యాచ్‌ అనగానే రెచ్చిపోయే ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ మరోసారి అదరగొట్టాడు. రూట్‌ వరుసగా రెండో సెంచరీతో చెలరేగారు.

India VS England : రూట్‌ ఆటే హైలెట్‌

India

Updated On : August 15, 2021 / 9:10 AM IST

India vs England 2nd Test : ఇండియాతో మ్యాచ్‌ అనగానే రెచ్చిపోయే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ మరోసారి అదరగొట్టాడు. తోటి ఆటగాళ్లు పెవిలియన్‌ బాట పడుతున్నా.. ఒక్కడే కోహ్లీ సేన బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. రూట్‌ వరుసగా రెండో సెంచరీతో చెలరేగడంతో ఇండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. రూట్‌తో పాటు బెయిర్‌స్టో రాణించడంతో ఇంగ్లండ్‌ 391 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇండియా బౌలర్లలో సిరాజ్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లతో రాణించాడు.

Read More : Crazy Uncles: శ్రీముఖి కోసం ఆర్ఆర్ఆర్ ఆరాటం..!

థర్డ్‌ డే ఆటలో రూట్‌ ఆటే హైలెట్‌గా నిలిచింది. తనదైన స్టయిల్లో అతను ఇండియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అతడికి బెయిర్‌స్టో నుంచి మంచి సపోర్ట్‌ లభించింది. ఇద్దరూ స్వేచ్ఛగా బౌండ్రీలు బాదారు. ఈ క్రమంలో ఫిఫ్టిలు పూర్తి చేసుకున్నారు. ఇక బెయిర్‌స్టో అవుటయ్యాక రూట్‌ పట్టువదల్లేదు. మరింత జాగ్రత్తగా ఆడి సెంచరీ కొట్టాడు. రూట్‌ కెరీర్‌లో ఇది 22వ సెంచరీ. టెయిలెండర్ల సాయంతో చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన రూట్‌ ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులు చేసింది.

Read More : Goa CM : జెండా ఎగురవేయకుండా అడ్డుకొంటే..కఠిన చర్యలు

మూడో రోజు ఉదయం 119/3తో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లండ్ అలవొకగా పరుగులు రాబట్టింది. బెయిర్ స్టో కలిసి రూట్ సమర్థవంతంగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. స్టార్టింగ్ నుంచే ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం మరింత రెచ్చిపోయాడు. లంచ్ వేళకు ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా..97 పరుగులు రాబట్టింది. అప్పటికి స్కోరు 216/3. లంచ్ తర్వాత బెయిర్ స్టో అవుట్ అయ్యాడు. మరోవైపు రూట్ క్రీజులో పాతుకపోవడంతో ఇంగ్లండ్ ను భారత్ ఒత్తిడిలోకి నెట్టలేకపోయింది.

Read More : AP : బ్యాక్ టు స్కూల్, మోగనున్న బడి గంటలు..నిబంధనలివే

200 బంతులను ఎదుర్కొన్న రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతరులు పెవిలియన్ చేజారుతున్నా…రూట్ మాత్రం అవుట్ కాలేదు. చివరి సెషన్ లో ఇంగ్లాండ్ 77 పరుగులు చేసి అయిదు వికెట్లు చేజార్చుకుంది. రూట్ (180 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 391 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఆదివారమంతా బ్యాటింగ్ చేయడం కోహ్లీ సేనకు చాలా అవసరం ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 364.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 391.