India vs England : ఇంగ్లండ్ ఆధిపత్యం, సెంచరీతో కదం తొక్కిన రూట్
రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది.

Bcci
India vs England : రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్.. 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. దాదాపు ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు కోల్పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. అతని దెబ్బకి టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ సిరీస్ లో ముచ్చటగా మూడో సెంచరీ చేశాడు ఇంగ్లండ్ కెప్టెన్. జో రూట్ 165 బంతుల్లో 121 పరుగులు చేశాడు.
Read More : Kabul Airport : కాబూల్‌లో మారణహోమం, జనాల మధ్యలోకి వెళ్లి పేల్చుకున్నారు..72 మంది మృతి
మంచి ఫామ్ లో ఉన్న జో రూట్ ని అద్భుతమైన డెలివరీతో బుమ్రా బౌల్డ్ చేశాడు. మలన్ 70 పరుగులు, రోరి బర్న్స్ 61 పరుగులు, హాసీబ్ హామీద్ 68 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో షమీ మూడు వికెట్లతో సత్తా చాటాడు. 120/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్‌లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆఖర్లో క్రెగ్ ఓవర్టన్, శామ్ కర్రన్ మెరుపులు మెరిపించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్ ఉన్నారు.