IND vs NZ 1st Test : తొలి టెస్టు డ్రా.. చేజారిన టీమిండియా విజయం
న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంలో భారత జట్టు నిలిచిపోయింది.

India Vs New Zealand 1st Test, Day 5 New Zealand Earn Hard Fought Draw After Last Wicket Resistanc
IND vs NZ 1st Test : న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంలో భారత జట్టు నిలిచిపోయింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినప్పటికీ కివీస్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ తొలిటెస్టును డ్రాతో ముగించారు. 94 ఓవర్లకు కివీస్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మరో వికెట్ పడగొడితే భారత్ తొలి టెస్టులో ఘన విజయం సాధించి ఉండేది. కానీ, కివీస్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ కాపాడుకున్నారు. 98 ఓవర్లకు కివీస్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 165 స్కోరు చేసింది. ఫలితంగా తొలి టెస్టు డ్రాగా ముగిసింది. గెలుపునకు దగ్గరగా వచ్చిన టీమిండియాకు నిరాశే ఎదురైంది.