కివీస్ కు ఊరట : ఘోరంగా ఓడిన భారత్

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 06:09 AM IST
కివీస్ కు ఊరట : ఘోరంగా ఓడిన భారత్

Updated On : January 31, 2019 / 6:09 AM IST

ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ బౌలర్లు కూడా తమ సత్తా చాటటానికి గట్టిగానే కృషి చేశారు. స్టార్టింగ్ లోనే గుప్టిల్, విలియమ్స్ వికెట్లు పడగొట్టి జోష్ లో ఉన్నట్లు కనిపించినా.. ఆ తర్వాత వచ్చిన టేలర్, నికోలస్ లు బాదేశారు. దీంతో కివీస్ విక్టరీ లాంఛనం అయ్యింది. టీమిండియా తీసిన రెండు వికెట్లు కూడా భువనేశ్వర్ ఖాతాలో పడ్డాయి.

తక్కువ స్కోర్ రికార్డ్ :
ఈ మ్యాచ్ లో మరో రికార్డ్ కూడా నమోదు చేసింది భారత్. పదేళ్లలో అత్యంత తక్కువ స్కోర్ కు ఆలౌట్ కావటం ఇదే. 2010లో ఇదే న్యూజిలాండ్ పై 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మళ్లీ అదే దేశ జట్టుపై 92 పరుగులకు ఔటయ్యి.. రికార్డ్ క్రియేట్ చేసింది. బౌల్ట్ దెబ్బకి విలవిలలాడిన భారత బ్యాట్స్ మెన్స్.. క్రీజ్ లోకి వచ్చినంతసేపు పట్టలేదు పెవిలియన్ బాట పట్టటానికి.