మ్యాచ్ ఆగింది: అభిమానుల కోసం భజ్జీ స్టెప్పులు

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంటర్‌టైనర్ అయిపోయాడు. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 రద్దు అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులంతా నిరుత్సాహానికి గురవుతున్నారనుకున్నారో ఏమో.. భజ్జీ, ఇర్ఫాన్ పఠాన్ స్టేడియంలోకి వచ్చారు.
స్టేడియంలోని గుంపును ఎంటర్‌టైన్ చేసేందుకు అప్పటికే చేసిన సెటప్ తో భజ్జీ స్టెప్పులేశాడు. ఈ వీడియోను భజ్జీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దాంతో పాటు గువాహటిలో నిన్న రాత్రి మ్యాచ్ జరగలేదు అని కామెంట్ చేశాడు. ఆదివారం భారత్ 2020లో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. వర్షం కారణంగా మైదానమంతా పూర్తిగా తడిచి ఆడేందుకు వీలుకాకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.
మ్యాచ్ కు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్ కు పిలిచాడు. అంతే మ్యాచ్ ఆరంభమయ్యే లోపులోనే వరుణుడు ఊపందుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20ని మంగళవారం ఇండోర్ వేదికగా ఆడనుండగా, మూడో టీ20ని పూణె వేదికగా శుక్రవారం జరుగుతుంది.