Ind vs WI 2nd T20: రాణించిన పంత్, కోహ్లీ.. వెంకటేష్ పవర్ హిట్టింగ్.. వెస్టిండీస్ టార్గెట్ 187

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది.

Ind vs WI 2nd T20: రాణించిన పంత్, కోహ్లీ.. వెంకటేష్ పవర్ హిట్టింగ్.. వెస్టిండీస్ టార్గెట్ 187

Team India

Updated On : February 18, 2022 / 9:05 PM IST

Ind vs WI 2nd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు రెండో ఓవర్ లోనే తొలి దెబ్బ తగిలింది. షెల్డన్ కాట్రెల్ రెండు పరుగుల వద్ద ఇషాన్ కిషన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 59 పరుగులకే టీమిండియాకు రెండో కోల్పోయింది. రస్టన్ చేజ్ 19 పరుగుల వద్ద రోహిత్ శర్మను పెవిలియన్ పంపించాడు. 72 పరుగుల వద్ద రస్టన్ చేజ్ సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేశాడు.

తర్వాత ఛేజ్ 52 పరుగుల వద్ద విరాట్ కోహ్లీని అవుట్ చేయడంతో నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ పంత్‌తో కలిసి పరుగులు రాబట్టాడు. అయితే 182పరుగుల వద్ద భారత్ వెంకటేష్ అవుట్ అయ్యాడు.

భారత్ తరపున కోహ్లీ, పంత్ 52పరుగులు చేయగా.. వెంకటేష్ అయ్యర్ 33పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 19పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 2పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 8పరుగులు మాత్రమే చేశారు. వెస్టిండీస్ తరపున రస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, షెఫర్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.

వెస్టిండీస్ ప్లేయింగ్ XI: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (WK), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (c), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, రోస్టన్ చేజ్, అకిల్ హోస్సేన్, రొమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్.