IRE vs IND 2nd T20 : రెండో టీ20లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ సొంతం

బుమ్రా నేతృత్వంలోని భార‌త జ‌ట్టు మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

IRE vs IND 2nd T20 : రెండో టీ20లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ సొంతం

Team India

Updated On : August 21, 2023 / 2:27 PM IST

IRE vs IND : బుమ్రా నేతృత్వంలోని భార‌త జ‌ట్టు మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డ‌బ్లిన్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఐరీష్ బ్యాట‌ర్ల‌లో ఆండ్రూ బల్బిర్నీ(72; 51 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ర‌వి బిష్ణోయ్, బుమ్రా తలా రెండు వికెట్లు తీయ‌గా.. అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌లో మ‌ళ్లీ మార్పులు త‌ప్ప‌వా..? భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన..!

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రుతురాజ్ గైక్వాడ్‌(58; 43 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా సంజు శాంస‌న్ (40; 26 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌), రింకు సింగ్‌(38 21 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సులు) లు రాణించారు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయ‌గా, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, మార్క్ అడైర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రుతురాజ్ గైక్వాడ్‌, య‌శ‌స్వి జైస్వాల్ (18; 11 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌) లు తొలి వికెట్‌కు 29 ప‌రుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే.. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప్ర‌మోష‌న్ అందుకుని వ‌న్‌డౌన్‌లో వ‌స్తున్న తిల‌క్ వ‌ర్మ (1) వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ నిరాశ‌ప‌రిచాడు. దీంతో భార‌త్ 34 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ ద‌శ‌లో రుతురాజ్‌కు సంజు శాంస‌న్ జ‌త‌క‌లిశాడు. రుతురాజ్ నిదానంగా ఆడగా శాంస‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. దీంతో 10 ఓవ‌ర్ల‌కు భార‌త్ 81/2 స్కోరుతో నిలిచింది.

Lionel Messi : చ‌రిత్ర సృష్టించిన లియోనల్‌ మెస్సీ.. అత్య‌ధిక టైటిళ్లు..

11వ ఓవ‌ర్‌ను జోస్ లిటిల్ వేయ‌గా శాంస‌న్ వ‌రుస‌గా హ్యాట్రిక్ ఫోర్ల‌తో పాటు ఓ సిక్స్ కొట్ట‌డంతో 18 ప‌రుగులు వ‌చ్చాయి. వేగంగా ఆడే క్ర‌మంలో బెంజమిన్ వైట్ బౌలింగ్‌లో శాంస‌న్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రుతురాజ్‌-శాంస‌న్ జోడి మూడో వికెట్‌కు 71 ప‌రుగులు జోడించారు. సంజు ఔటైన త‌రువాత వేగం పెంచిన రుతురాజ్ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. కాసేప‌టికే మెక్‌కార్తీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి జ‌ట్టు స్కోరు 129 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

గ‌త మ్యాచ్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేసిన‌ప్ప‌టికీ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రానీ రింకూ సింగ్ ఈ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాడు. మెక్‌కార్తీ వేసిన 19వ ఓవ‌ర్‌లో ఓ ఫోర్‌, రెండు సిక్స‌ర్లు బాదాడంతో ఈ ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు వ‌చ్చాయి. ఆఖ‌రి ఓవ‌ర్‌లో శివ‌మ్ దూబే (22 నాటౌట్; 16 బంతుల్లో రెండు సిక్స‌ర్లు) రెండు సిక్స‌ర్లు బాద‌గా ఓ సిక్స్ కొట్టిన రింకూ సింగ్ ఆ త‌రువాత బంతికి భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. చివ‌రి బంతికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ బైస్ రూపంలో సింగిల్ తీయడంతో ఇన్నింగ్స్ ముగిసింది.

Virat Kohli : సూర‌త్ వ్యాపార వేత్త అభిమానం.. విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా వజ్రాల బ్యాటు..!