ENG vs IND : ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ విజయం.. సిరీస్ సమం..
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

India win the fifth test
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తద్వారా అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (105), హ్యారీ బ్రూక్ (111) లు శతకాలతో సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ ఓ వికెట్ సాధించాడు.
ఆఖరి రోజు చేతిలో నాలుగు వికెట్లు ఉండగా.. 35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు సిరాజ్ షాక్ ఇచ్చాడు. ప్రసిద్ద్ కృష్ణ తొలి ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చినా.. సిరాజ్ తన వరుస ఓవర్లలో ఓవర్ నైట్ బ్యాటర్లు జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9)లను ఔట్ చేశాడు. మరికాసేపటికే జోష్ టంగ్ (0)ను ప్రసిద్ద్ కృష్ణ ఔట్ చేశాడు.
TAKE A BOW, MOHD. SIRAJ!
Scorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND pic.twitter.com/opZZ53Xnxh
— BCCI (@BCCI) August 4, 2025
అయితే.. తీవ్రంగా గాయపడి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రానీ క్రిస్ వోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బరిలోకి దిగాడు. విజయానికి మరో 17 పరుగులు అవసరం అయిన తరుణంలో ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. అయితే.. మరో ఎండ్‌లో ఉన్న అట్కిస్కన్ (17) మాత్రం వోక్స్ కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకుండా జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించాడు. అయితే.. సిరాజ్ ఓ అద్భుత బంతితో అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు.