కివీస్‌తో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

కివీస్‌తో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Updated On : February 6, 2019 / 6:33 AM IST

కివీస్ గడ్డపై టీమిండియా మరోపోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ విజయానంతరం వెల్లింగ్టన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. 4-1 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్‌పై మరోసారి ఆధిక్యం ప్రదర్శించి విజయం చేజిక్కుంచుకోవాలని ఆశపడుతోంది. కాగా, టీ20లలో తమ జట్టును గెలిపించుకోవడం విలియమ్సన్‌కు క్లిష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే స్టార్ హిట్టర్ అయిన మార్టిన్ గఫ్తిల్ గాయం కారణంగా జట్టుకు దూరమవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. 

అయితే కెప్టెన్‌ విలియమ్సన్‌, విధ్వంసక ఓపెనర్‌ మన్రో, సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌, ఆల్‌రౌండర్‌ నీషమ్‌ లాంటి ఆటగాళ్లు సత్తా చాటితే కివీస్‌.. భారత్‌కు దీటుగా నిలవగలదు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా జట్టులో ఉండటంతో తుది జట్టుకు కీపర్‌గా ఎవరాడతారనేది ఆసక్తికరం.