వైజాగ్‌‌కు క్రికెట్ ఫీవర్ : ఆసీస్‌-భారత్‌ ఫస్ట్ టీ20 ఫైట్

వైజాగ్‌‌కు క్రికెట్ ఫీవర్ : ఆసీస్‌-భారత్‌ ఫస్ట్ టీ20 ఫైట్

Updated On : February 23, 2019 / 12:15 PM IST

ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్‌తో తలపడిన అనంతరం ఆస్ట్రేలియా బయల్దేరింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌ల విజయాలను అందుకుని టీ20ని మాత్రం టైగా ముగించుకుంది. ఆసీస్ గడ్డపైనే కంగారూలను పరుగులు పెట్టించిన భారత్.. సొంతగడ్డపై ఏపాటి ప్రదర్శన ఇస్తుందో చెప్పనక్కర్లేదు. 

మరో పక్క తమకు బాగా కలిసొచ్చిన మైదానాల్లోనే భారత క్రికెటర్లను ఎదుర్కోలేని కంగారూలు పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో కనిపిస్తున్నారు. 2 టీ20 మ్యాచ్‌లు, 5 వన్డే మ్యాచ్‌లుగా ముగియనున్న ఈ పర్యటనలో ఫేవరేట్‌గా భారత్‌యే కనిపిస్తోంది. 
 
మహేంద్రుడికి బాగా కలిసొచ్చిన పిచ్.. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న విరాట్.. పూర్తి ఫామ్‌లో కనిపిస్తున్న హిట్టర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు ఆసీస్‌ను చిత్తు చేసేందుకు సిద్ధమయ్యారు. కేఎల్ రాహుల్‌ను మరోసారి అదృష్టం వరించగా ఈ సారైనా ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. మహేంద్రుడి అనుభవం జట్టుకు సులువైన విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారంతా. ఇక ఆలౌరౌండర్లు కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్ తీవ్రంగా చెమటోడ్చి సత్తా నిరూపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
Read Also: పంత్ వార్నింగ్: మహీ భాయ్ రెడీగా ఉండు..

ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనింగ్ పెద్ద సమస్యగా మారింది. మార్కస్ స్టోనిస్, ఆరోన్ ఫించ్‌లు సైతం చక్కటి ఓపెనింగ్ ఇవ్వలేకపోతున్నారు. భారమంతా ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కాంబ్ మీదే కనబడుతోంది. గ్లెన్ మాక్స్ వెల్, షాన్ మార్షల్‌లు ఏ మాత్రమైనా నిలబడితేనే మ్యాచ్ మీద ఆశలు నిలబడతాయి. 

జట్ల అంచనా:
భారత్: 

శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి( కెప్టెన్), ధోనీ (వికెట్ కీపర్), రిషభ్ పంత్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్య, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్

ఆస్ట్రేలియా: 
ఆరోన్ ఫించ్(కెప్టెన్), మార్కస్ స్టోనిస్, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, ఆష్టన్ టర్నర్/షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్  క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్

పిచ్(స్వభావం):
 వైజాగ్ స్టేడియంలోని బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌కు బాగా కలిసొచ్చే అంశం. స్పిన్నర్ల పనితనం చూపిస్తేనే లాభాలుంటాయి. ఉష్ణోగ్రత రీత్యా పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తుంది.  
​​​​​​​Read Also: షూటింగ్‌లో ఇండియా జయహో: గురి పెట్టి కొడితే గోల్డ్ మెడల్ వచ్చింది