Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఐఓసీ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆ ఒక్క‌టి పూర్తి అయితే..

క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. విశ్వ క్రీడ‌ల్లో క్రికెట్‌ను చూడాల‌న్న అభిమానుల కోరిక నెర‌వేర‌బోతుంది.

Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఐఓసీ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆ ఒక్క‌టి పూర్తి అయితే..

Cricket In Olympics

Updated On : October 13, 2023 / 6:03 PM IST

Cricket In 2028 LA Olympics : క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. విశ్వ క్రీడ‌ల్లో క్రికెట్‌ను చూడాల‌న్న అభిమానుల కోరిక నెర‌వేర‌బోతుంది. లాస్ ఏంజిల్స్‌ వేదిక‌గా 2028లో జ‌ర‌గ‌నున్న‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చ‌డానికి అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (IOC) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ శుక్ర‌వారం వెలువ‌డింది. ముంబైలో జ‌రుగుతున్న‌ ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు స‌మావేశం త‌రువాత ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాల‌ని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఎట్ల‌కేల‌కు ఐవోసీ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ను మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మ‌రో నాలుగు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‍బాల్, స్క్వాష్, లాక్రోష్ ల‌ను కూడా చేర్చేందుకు ఐఓసీ ఆమోద్ర ముద్ర వేసింద‌ని థామ‌స్ తెలిపారు. అయితే.. బ్యాలెట్ ప‌ద్ద‌తిలో జ‌రిగే ఐఓసీ మెంబ‌ర్షిప్ ఓటింగ్‌లో క్రికెట్ మ‌ద్ద‌తుగా ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. ఈ ప్ర‌క్రియ సోమ‌వారం (అక్టోబ‌ర్ 16న‌) జ‌ర‌గ‌నుంది. ఇది ఒక్క‌టి పూర్తి అయితే.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగే ఒలింపిక్స్‌ను చూడొచ్చు.

Also Read : పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. గిల్ ఖ‌చ్చితంగా ఆడ‌తాడు : ఎంఎస్‌కే ప్ర‌సాద్‌

కాగా.. 1900లో పారిస్ వేదిక‌గా నిర్వ‌హించిన ఒలింపిక్స్ క్రీడ‌ల్లో క్రికెట్‌ను మొద‌టి సారి చేర్చారు. ఆ త‌రువాత మ‌రే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడ‌లేదు. అదే మొద‌టి సారి చివ‌రి సారి అయ్యింది. 128 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూసే అవ‌కాశం ఉంది. గ‌తేడాది కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో మ‌హిళ‌ల క్రికెట్‌ను భాగం చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read : బాయ్‌కాట్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌.. జ‌వాన్ల ప్రాణాలు పోతుంటే..?