పేరు చెప్పొద్దు.. ఆడి చూపించు : IPL 2019 సాంగ్ రిలీజ్

పేరు చెప్పొద్దు.. ఆడి చూపించు : IPL 2019 సాంగ్ రిలీజ్

Updated On : March 6, 2019 / 9:58 AM IST

నువ్వెవరో.. నీ పేరేంటో చెప్పొద్దు.. ఆట చూపించు.. ఆడి చూపించు అంటున్నాయి IPL టీమ్స్. మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభంకాబోతున్న సీజన్ కోసం 2019 సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి సీజన్‌కు కొత్త ఐడియాతో సాంగ్ రూపొందిస్తున్న బ్రాడ్ కాస్టర్లు ఈసారి యువ ప్లేయర్లను ప్రోత్సహించేలా సాంగ్ రూపొందించారు. యువ క్రికెటర్లకు అవకాశమిచ్చి.. ప్రతిభను వాడుకోవడంలో ముందుండే ఎంఎస్ ధోనీ.. విరాట్ కోహ్లీ సాంగ్ క్లైమాక్స్‌లో కనిపించడంతో హైలెట్‌గా నిలిచింది.
Also Read : ఫన్నీ మూమెంట్: అభిమానిని పరుగులు పెట్టించిన ధోనీ

ఐపీఎల్‌లో ఆడుతోన్న భారత క్రికెటర్లంతా ఈ సాంగ్‌లో కనిపించి కనువిందు చేశారు. ఈ సాంగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ఖాతా ద్వారా విడుదల చేసింది. రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ ఐపీఎల్ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. మరో ఫ్రేమ్‌లో ఓ గ్రూపు ప్లేయర్లంతా గల్లీ క్రికెట్ ఆడుతుంటారు. అనుకోకుండా వారికి ఐపీఎల్‌లోకి వెళ్లాలనుకుంటారు. 

అంతే ఫ్రేమ్‌లలో ఒకరినొకరు తోసుకుంటూ ఐపీఎల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే దాదాపు అంతా ఫెయిలైపోతారు. ఇలా భీకరంగా సాగుతున్న తోపులాటలో ధోనీ ఎంటర్ అవగానే అంతా సైలెంట్ అయిపోతారు. అప్పుడే ధోనీ వెనుక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చి యువ క్రికెటర్లు ఐపీఎల్ లోకి వచ్చేందుకు మార్గం చేస్తారు. 

ఆదరాబాదరాగా ప్లేయర్ల ముందుకు వచ్చిన గల్లీ ప్లేయర్..  నా పేరు అంటూ ఉంటుంటే ‘పేరొద్దు.. ఆట చూపించు’ అని ధోనీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటారు. వెనుక నుంచి ‘గేమ్ బనాయేగా నామ్(ఆటే నీకు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది)’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో పాట వినిపిస్తూ ఉన్న సాంగ్ ను విడుదల చేశారు. కొత్తగా ఉన్న ఆలోచన నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తుంది. 

Also Read : కోహ్లీ, విజయ్‌లు మ్యాచ్‌‌ను ఇలాగే గెలిచారా?