IPL 2019: బెయిర్ స్టోకు చెన్నైతోనే చివరి మ్యాచ్‌

IPL 2019: బెయిర్ స్టోకు చెన్నైతోనే చివరి మ్యాచ్‌

Updated On : April 20, 2019 / 1:47 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. సీజన్ ఆరంభం నుంచి కీపింగ్‌లోనే కాదు.. హిట్టింగ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. సన్‌రైజర్స్ అభిమానులకు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌లు క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గెలుస్తామనేంత నమ్మకం వచ్చేసింది. 

2019 ఐసీసీ వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టోకు వరల్డ్ కప్ టోర్నీకి ప్రాక్టీసు అయ్యేందుకు రమ్మని పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 23 మంగళవారం చెన్నైతో ఆడాల్సిన మ్యాచ్‌యే బెయిర్ స్టోకు ఈ ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ కానుంది. దాని తర్వాత ఇంగ్లాండ్‌కు బయల్దేరనున్నాడు. 

అసలైతే ఏప్రిల్ 26నాటికి ఇంగ్లాండ్ చేరుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలిచ్చింది. వరల్డ్ కప్‌కు ముందు ఐర్లాండ్‌తో ఒక వన్డే, ఆ తర్వాత పాక్‌తో 4వన్డేల సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్. తాను వెళ్లకు ముందే హైదరాబాద్ మరో మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించేలా చేస్తానని బెయిర్ స్టో విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. 

బెయిర్ స్టోతో పాటుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మార్టిన్ గఫ్తిల్‌లు కూడా లీగ్ మధ్యలోనే జట్టును వీడనున్నారు. 
Also Read : RRvsMI: రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన ముంబై