IPL 2019: పంజాబ్ పతనం కోల్‌కతా శాసించింది

ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన పోరులో కోల్‌కతా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం కోల్‌కతా వేదికగా పంజాబ్ తో జరిగిన పోరులో 28 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ముందున్న 219 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. కోల్‌కతా ధాటికి పంజాబ్ బ్యాట్స్ మెన్ వణికిపోయారు. క్రీజులో నిలదొక్కుకునేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది.
ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), గేల్(20)పరుగులకే అవుట్ అవడం జట్టుకు బలహీనంగా మారింది. మయాంక్ అగర్వాల్(58), సర్ఫరాజ్ ఖాన్(13), డేవిడ్ మిల్లర్(59), మన్‌దీప్ సింగ్(33)లు రాణించినప్పటికీ ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లు ముగిసేప్పటికీ ఇంకా 6వికెట్లు చేతిలో ఉన్నా 28 పరుగులు చేయాల్సి ఉండడంతో పరాజయం తప్పలేదు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సొంతగడ్డపై దినేశ్ కార్తీక్ జట్టు రెచ్చిపోయింది. ఈ క్రమంలో కోల్‌కతా … పరుగుల టార్గెట్ ను పంజాబ్ ముందుంచింది. ఆరంభంలో ఓపెనర్లు క్రిస్ లిన్(10), సునీల్ నరైన్(24)లు కాస్త తడబడినా రాబిన్ ఊతప్ప(65), నితీశ్ రానా(63) స్కోరును ముందుకు నడిపారు.
ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రస్సెల్ (48; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఇన్నింగ్స్ చివర్లో మయాంక్ క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దినేశ్ కార్తీక్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు.
పంజాబ్ జట్టులో మొహమ్మద్ షమీ(1), వరుణ్ చక్రవర్తి(1), హర్దస్ విల్జియోన్(1), ఆండ్రూ టై(1) లు తీయగలిగారు.