IPL 2020: వేలంలో 332 మందితో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్
73 ఖాళీ స్థానాలకు వేలం జరుగుతుంది. ఎప్పటిలాగే స్టార్ ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్, జో రూట్ లాంటి ప్లేయర్ లు లీగ్‌కు దూరం కానున్నారు.

73 ఖాళీ స్థానాలకు వేలం జరుగుతుంది. ఎప్పటిలాగే స్టార్ ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్, జో రూట్ లాంటి ప్లేయర్ లు లీగ్‌కు దూరం కానున్నారు.
ఐపీఎల్ 2020కు సీజన్ సిద్ధమైంది. వేలానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. కోల్‌కతా వేదికగా డిసెంబరు 13న జరగనున్న వేలానికి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటోంది. ఈ సీజన్‌లో ఆడేందుకు మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. వారి నుంచి 332 మందిని షార్ట్ లిస్ట్ చేసి వేలంలో ఉంచనున్నారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది.
డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు వేలం ఆరంభమవుతోంది. 8 ఫ్రాంచైజీలలో 73 ఖాళీ స్థానాలకు వేలం జరుగుతుంది. ఎప్పటిలాగే స్టార్ ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్, జో రూట్ లాంటి ప్లేయర్ లు లీగ్‌కు దూరం కానున్నారు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ స్టార్క్ విరామం తీసుకోవడం శోచనీయం. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ షార్ట్ క్రికెట్ ఫార్మాట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు.
ఈ సారి వేలంలో 24 మంది కొత్త ప్లేయర్లు దర్శనమివ్వనున్నారు. 19 మంది మాత్రం టీమిండియాకు ఆడారు. ముష్ఫికర్ రహీమ్, ఆడమ్ జంపా పేర్లను ఫ్రాంచైజీలే షార్ట్ లిస్ట్ చేయగా రహీమ్ వేలం నుంచి తప్పుకున్నాడు. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఇయోన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), కమిన్స్ (ఆసీస్) వేలంలో భారీ ధర పలకడం ఖాయం. రాబిన్ ఉతప్ప, క్రిస్‌లిన్, ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్‌కు సైతం మంచి డిమాండ్ ఉంది.