IPL 2020: సీఎస్కే విడిచిపెట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే

IPL 2020: సీఎస్కే విడిచిపెట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే

Updated On : November 16, 2019 / 7:47 AM IST

డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ నాల్గోసారి టైటిల్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. అంతేకాకుండా శుక్రవారం 12మంది ప్లేయర్లను ఐపీఎల్ వేలానికి విడిచిపెడుతూ సంచలన ప్రకటన చేసింది. డిసెంబరులో కోల్ కతా వేదికగా జరిగే 2020 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ 5దేశీ ప్లేయర్లు, 2విదేశీ ప్లేయర్లను తీసుకోనుంది. 

ముంబై ఇండియన్స్ తో పాటు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు ఐదుగురు ప్లేయర్లను విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. 2020వేలానికి ముందు జట్టు ఎంపికలో భాగంగా ప్లేయర్లను విడుదల చేసింది. 

ముంబై ఇండియన్స్ అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, క్రునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ చాహర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయంత్ యాదవ్, ఆదిత్య తారే, అనుకుల్ రాయ్, ధావల్ కులకర్ణి (ట్రేడెడ్ ఇన్), క్వింటన్ డి కాడ్, షెరాన్ (వర్తకం), లాసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెనాఘన్, ట్రెంట్ బౌల్ట్ (ట్రేడెడ్ ఇన్).

ముంబై ఇండియన్స్ విడిచిపెట్టిన ప్లేయర్లు
ఎవిన్ లూయిస్, ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెండోర్ఫ్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, బెన్ కట్టింగ్, యువరాజ్ సింగ్, మయాంక్ మార్కండే (ట్రేడెడ్ అవుట్), బరీందర్ శ్రాన్, రసిఖ్ సలాం, పంకజ్ జస్వాల్, సిద్ధేష్ లాడ్ (ట్రేడెడ్ అవుట్), అల్జారీ జోసెఫ్.

చెన్నై సూపర్ కింగ్స్ అంటిపెట్టుకున్న ఆటగాళ్లు
ఎంఎస్ ధోనీ(కెప్టెన్& కీపర్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, మురళీ విజయ్, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, రితురాజ్ గైక్వాడ్, డేన్ బ్రావో, కర్ణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్, మిచెల్ శాంతర్, శార్దూల్ ఠాకూర్, కేఎమ్ ఆసిఫ్, డేవిడ్ విల్లే, దీపక్ చాహర్, ఎన్ జగదీశన్

చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టిన ప్లేయర్లు
మోహిత్ శర్మ, శామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, ధ్రువ్ శోరె, చైతన్య బిష్ణోయ్