IPL 2020కి కొత్త షెడ్యూల్‌ !

IPL 2020కి కొత్త షెడ్యూల్‌ !

Updated On : August 30, 2020 / 5:11 PM IST

IPL 2020 Schedule: క్రికెట్‌ ఔత్సాహికులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అనుకున్న దానికంటే ఆలస్యం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న ప్రారంభం కావాల్సి ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)- ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య తొలి తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు.

సీఎస్కే ఆటగాళ్లతో పాటు టీం సిబ్బంది కూడా కరోనా వైరస్‌ బారినపడటం ఆందోళనకరంగా మారింది. అందరి కంటే ముందే దుబాయ్‌కు చేరుకున్న ధోనీ సేన కరోనా కారణంగా క్వారెంటైన్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 10 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు.

ఈ ప్రభావం లీగ్‌ ఆరంభ మ్యాచ్‌పై పడేట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బోర్డు సీనియర్‌ అధికారి సమాచారం ప్రకారం.. షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా లీగ్‌ను కొంత ఆలస్యంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనుకున్న దానికంటే ఆటగాళ్లపై ఆరంభంలోనే కరోనా ప్రభావం చూపడంతో అసలు లీగ్‌ సాధ్యమవుతుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుండగా సీఎస్‌కే సీనియర్‌ ఆటగాడు సురేష్‌ రైనా ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోవడం షాకింగ్‌కి గురిచేసింది. ఐపీఎల్‌-2020 సీజన్ నుంచి రైనా తప్పుకుంటున్నట్లు జట్టు యాజమాన్యం అనుహ్యంగా ప్రకటించి అందరినీ అశ్చర్యంలో ముంచెత్తింది.