IPL 2020: గడిచిన 5నెలలు ఆరు రోజులుగా ఫీలయ్యా – విరాట్ కోహ్లీ

IPL 2020: గడిచిన 5నెలలు ఆరు రోజులుగా ఫీలయ్యా – విరాట్ కోహ్లీ

Updated On : August 29, 2020 / 9:06 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైరల్ అయింది. ఐదు నెలల క్రితం మైదానంలో అడుగుపెట్టిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. మళ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టామని రాసుకొచ్చాడు. ‘ఐదు నెలలుగా మైదానంలో అడుగుపెట్టలేదు. నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాక అది 6రోజులే అన్నట్లు అనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు ఫస్ట్ సెషన్ అద్భుతంగా గడిచింది’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.

దాంతో పాటుగా జట్టులో ఇతర సభ్యులు కష్టపడి అలసిపోయిన పిక్చర్లు షేర్ చేశాడు. కోహ్లీతో పాటు ఇతర టీమ్ మేట్స్ దుబాయిలో రీసెంట్ గా క్వారంటైన్ ను పూర్తి చేసుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘అంతా మంచి విషయాలే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వారంటైన్ ను పూర్తి చేసుకుని దుబాయ్ లో కలుసుకుంది’ అని పోస్టు చేసింది.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసేందుకు కుతుహలంగా కనపడుతుండటంతో.. ఫేసర్ ఉమేశ్ యాదవ్ ఫుట్‌బాల్ వేలిపై నిలబెట్టాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గేమింగ్ మెషీన్ దగ్గరే టైమ్ స్పెండ్ చేశాడు.

విరాట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్:

గత సీజన్లో ఆర్సీబీ లీగ్ పట్టికలో చివరి స్థానంలో ఉండి ముగించింది. సెప్టెంబర్ 19నుంచి జరిగే సీజన్లో సత్తా చాటాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లీగ్ ఆరంభానికి ఆలస్యమైంది. ఐపీఎల్ 13వ సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.