IPL 2022: సన్రైజర్స్ అద్భుతమైన ఆఫర్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ను మీరే ఎంచుకోవచ్చు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పూణెలోని మహారాష్ట్ర అసో్సియేషన్ క్రికెట్..

Srh Vs Rr
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సర్వం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పూణెలోని మహారాష్ట్ర అసో్సియేషన్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ పై ఐపీఎల్ అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ను ఇన్నాళ్లు అంపైర్లు మాత్రమే నిర్ణయించే వారు. ఆ సదవకాశాన్ని ఈ సారి ప్రేక్షకులకు ఇచ్చింది. అలా అని గ్రౌండ్లో అందించే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కాదు.. ఇది వేరు. ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఇచ్చేందుకు ఆన్ లైన్లో ఓటింగ్ వేసుకోవచ్చని తెలిపింది.
ట్విట్టర్ వేదికగా ఈ గుడ్ న్యూస్ చెప్పిన సన్రైజర్స్.. రెండు పాయింట్లతో ఒక పోస్టర్ ను విడుదల చేసింది.
Read Also: కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న సన్రైజర్స్
1). ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కు మీ ఛాయీస్ ను తెలియజేయవచ్చు.
2). మ్యాచ్ అయిపోయిన తర్వాత నుంచి ఈ కాంటెస్ట్ మొదలవుతుంది. అలా 15నిమిషాల్లో వచ్చిన ఓట్లను బట్టి ఫ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో నిర్ణయిస్తామని పేర్కొంది.
ఈ పోస్టర్ తో పాటు పైన.. మీరు ఫ్యాన్ అయితే మీ ప్లేయర్ (ఛాయీస్) తెలియజేయండంటూ రాసుకొచ్చింది.