IPL 2023 LSG Vs PBSK: కేఎల్ రాహుల్ అర్ధశతకం.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ స్టాండిన్ కెప్టెన్ సామ్ కుర్రాన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

LSG vs PBKS
IPL 2023 LSG Vs PBSK: IPL 2023 LSG Vs PBSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (74; 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో మెరువగా కైల్ మేయర్స్(29) పర్వాలేదనిపించాడు. కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్‌లు విఫలం కావడంతో లక్నో ఓ మోస్తారు స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు, రబాడ రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, సికందర్ రజా లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
లక్నో జట్టు ఈ సీజన్ లో మొదటి నుంచి బాగా రాణిస్తోంది. ఇప్పటివరకు మొత్తం నాలుగు మ్యాచులు ఆడి మూడింట్లో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ జట్టు నాలుగు మ్యాచులు ఆడి రెండింట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు: అధర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్ ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కుర్రాన్(స్టాండిన్ కెప్టెన్), జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్ దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హూడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
IPL 2023: డీకేని ధోనీతో పోల్చిన వారిని జైలుకి పంపాలి.. అంటూ ట్రోలింగ్.. ఎందుకంటే?