IPL 2023: సమ ఉజ్జీల మధ్య పోరు.. ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్‌లో పెరిగిన ఉత్కంఠ
IPL 2023: అసలు సిసలైన మ్యాచ్. ఐపీఎల్ వేడుకలోకెల్లా పెద్ద వేడుక. సమ ఉజ్జీల మధ్య పోరు.

RCB vs CSK
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో జరుగుతున్న 24వ మ్యాచ్ ఇది. బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
టాస్ గెలిచే జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఆర్సీబీ, సీఎస్కే జట్లు రెండూ బలమైనవే. ఐపీఎల్ చరిత్ర చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో నాలుగేసి మ్యాచులు ఆడాయి.
వాటిల్లో ఇరు జట్లూ రెండేసి మ్యాచుల చొప్పున గెలిచాయి. దీంతో ఆ రెండు జట్లకూ నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ పరంగా ఆర్సీబీ కంటే సీఎస్కే కాస్త ముందంజలో ఉంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis). ఈ జట్టులోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ధోనీ, కోహ్లీ అభిమానులకు ఈ మ్యాచ్ పెద్ద పండుగే.
ప్రస్తుతం ఐపీఎల్ లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచు ఓడింది. రెండవ, మూడవ మ్యాచులో గెలిచింది. నాలుగో మ్యాచులో ఓడింది. మొత్తం రెండు మ్యాచుల్లో గెలిచి, రెండింట్లో ఓడింది. ఇక ఆర్సీబీ తొలి మ్యాచులో గెలిచింది. తర్వాతి రెండు మ్యాచుల్లో ఓడింది. నాలుగో మ్యాచులో గెలిచింది.
IPL 2023, MI vs KKR:వెంకటేశ్ అయ్యర్ శతకం వృథా.. కోల్‌కతా పై ముంబై గెలుపు