IPL 2023, MI vs KKR:వెంకటేశ్ అయ్యర్ శతకం వృథా.. కోల్‌కతా పై ముంబై గెలుపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

Mumbai Indians
IPL 2023, MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ఇషాన్ కిషన్(58; 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా సూర్యకుమార్ యాదవ్(43; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్(23 నాటౌట్; 12 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో లక్ష్యాన్ని ఈజీగానే ఛేదించింది. కోల్‌కతా బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. కోల్‌కతాపై గెలుపుతో ఈ సీజన్‌లో ముంబై రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Venkatesh Iyer: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన వెంకటేశ్ అయ్యర్.. మెక్‌కల్లమ్ తరువాత
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(104; 51బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. రహ్మానుల్లా గుర్బాజ్(8), ఎన్ జగదీశన్(0), నితీశ్ రాణా(5) రింకూ సింగ్(18)లు విఫలం అయ్యారు. ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(21; 11బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) వేగంగా పరుగులు చేయడంతో ముంబై ముందు ఓ మోస్తారు లక్ష్యం నిలిచింది. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీయగా, చావ్లా, జాన్సెన్, కామెరూన్ గ్రీన్, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.