MI vs SRH: గ్రీన్ శతకం.. హైదరాబాద్‌పై ముంబై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

MI vs SRH
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
ముంబై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో 12 బంతులు మిగిలి ఉండగా 18 ఓవర్లలోనే ఛేదించింది.
-
రోహిత్ శర్మ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. మయాంక్ దగర్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డి క్యాచ్ అందుకోవడంతో రోహిత్ శర్మ (56) ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 148 పరుగుల(13.1వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
రోహిత్ అర్ధశతకం
12 ఓవర్‌ను కార్తిక్ త్యాగి వేయగా రెండో బంతికి ఫోర్ కొట్టి 31 బంతుల్లో రోహిత్ శర్మ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 12 ఓవర్లకు ముంబై స్కోరు 132/1. రోహిత్ శర్మ(55), కామెరూన్ గ్రీన్(58) లు క్రీజులో ఉన్నారు.
-
సిక్స్‌తో గ్రీన్ అర్ధశతకం
కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడుతున్నారు. వివ్రాంత్ శర్మ బౌలింగ్‌లో సిక్స్‌తో 20 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. 9 ఓవర్లకు ముంబై స్కోరు 100/1. రోహిత్ శర్మ(23 బంతుల్లో 31), కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో51) లు క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్.. దూకుడుగా ఆడుతున్న గ్రీన్
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్(14) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు ముంబై స్కోరు 60/1. రోహిత్ శర్మ(15 బంతుల్లో 15), కామెరూన్ గ్రీన్(10 బంతుల్లో30) లు క్రీజులో ఉన్నారు.
-
ముంబై లక్ష్యం 201
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(83; 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), వివ్రాంత్ శర్మ(69; 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో మెరుపులు మెరిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. మిగిలిన వారిలో క్లాసెన్(18) పర్వాలేదనిపించగా, గ్లెన్ ఫిలిఫ్స్(1), హ్యారీ బ్రూక్(0) లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ నాలుగు వికెట్లు తీయగా, క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
-
స్వల్ప వ్యవధిలో మయాంక్ అగర్వాల్, గ్లెన్ ఫిలిఫ్స్ ఔట్
స్వల్ప వ్యవధిలో సన్‌రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(83), గ్లెన్ ఫిలిఫ్స్(1) లు ఔట్ అయ్యారు. ఆకాష్ మధ్వల్ బౌలింగ్‌లో(16.4వ ఓవర్) ఇషాన్ కిషన్ చేతికి మయాంక్ చిక్కగా, జోర్డాన్ బౌలింగ్‌లో కార్తికేయ క్యాచ్ అందుకోవడంతో ఫిలిఫ్స్ పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 177 పరుగుల(17.4) వద్ద మూడో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్.
-
వివ్రాంత్ శర్మ ఔట్
ఎట్టకేలకు ముంబై బౌలర్లు వికెట్ పడగొట్టారు. ఆకాష్ మధ్వల్ బౌలింగ్‌లో నెహాల్ వదేరా క్యాచ్ అందుకోవడంతో వివ్రాంత్ శర్మ(69) ఔట్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 140 పరుగుల(13.5వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 14 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 144/1. హెన్రిచ్ క్లాసెన్ (4), మయాంక్ అగర్వాల్(53)లు క్రీజులో ఉన్నారు.
-
మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ
13వ ఓవర్‌ను జాసన్ బెహ్రెన్ డార్ఫ్ వేయగా రెండో బంతికి ఫోర్ కొట్టిన మయాంక్ అగర్వాల్ 32 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో మయాంక్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇందులో 7 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. 13 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 130/0. వివ్రాంత్ శర్మ(68), మయాంక్ అగర్వాల్(53)లు క్రీజులో ఉన్నారు.
-
వివ్రాంత్ శర్మ అర్ధశతకం
పదో ఓవర్‌ను క్రిస్ జోర్డాన్ వేయగా ఐదో బంతికి సింగిల్ తీసి 36 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు వివ్రాంత్ శర్మ. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 93/0. వివ్రాంత్ శర్మ(50), మయాంక్ అగర్వాల్(35)లు క్రీజులో ఉన్నారు.
-
నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్ ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు వికెట్ ఇవ్వకుండా ఆడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 53/0. వివ్రాంత్ శర్మ(27), మయాంక్ అగర్వాల్(21)లు క్రీజులో ఉన్నారు.
-
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
-
టాస్ గెలిచిన ముంబై
వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.