IPL 2023, SRH vs MI: సన్‌రైజర్స్‌పై ముంబై గెలుపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్( Mumbai Indians) విజయం సాధించింది.

SRH vs MI
IPL 2023, SRH vs MI:ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్( Mumbai Indians) 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 178 పరుగులకే ఆలౌటైంది.
LIVE NEWS & UPDATES
-
ముంబై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్( Mumbai Indians) 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 178 పరుగులకే ఆలౌటైంది.
-
ఎనిమిదో వికెట్ డౌన్
బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో మరో 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అయితే ఐదో బంతికి సుందర్ రనౌట్ అయ్యాడు. 18 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 169/8. భువనేశ్వర్ కుమార్(0), అబ్దుల్ సమద్(8) క్రీజులో ఉన్నారు.
-
మార్కో జాన్సన్ ఔట్
సన్‌రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. రిలే మెరెడిత్ బౌలింగ్‌లో మార్కో జాన్సన్(13) ఔట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 150/7. వాషింగ్టన్ సుందర్(1), అబ్దుల్ సమద్(3) క్రీజులో ఉన్నారు.
-
మయాంక్ ఔట్
సన్‌రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. రిలే మెరెడిత్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ అగర్వాల్ (48) ఔట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 132 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 133/6. మార్కో జాన్సెన్(0), అబ్దుల్ సమద్(1) క్రీజులో ఉన్నారు.
-
హెన్రిచ్ క్లాసెన్ ఔట్
సన్‌రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్(36) ఔటైయ్యాడు. పీయూష్ చావ్లా వేసిన 14 ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టిన క్లాసెన్ అదే దూకుడుతో మరో భారీ షాట్‌కు యత్నించి టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు. దీంతో సన్‌రైజర్స్ 127 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 14 వర్లకు సన్‌రైజర్స్ స్కోరు 127/5. అబ్దుల్ సమద్(0), మయాంక్ అగర్వాల్(46) క్రీజులో ఉన్నారు.
-
అభిషేక్ శర్మ ఔట్
సన్‌రైజర్స్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ శర్మ(1) పెవిలియన్ కు చేరుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ 72 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 76/4. హెన్రిచ్ క్లాసెన్(2), మయాంక్ అగర్వాల్(31) క్రీజులో ఉన్నారు.
-
మార్‌క్రమ్ ఔట్
సన్‌రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హృతిక్ షోకీన్ క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ మార్‌క్రమ్(22) ఔట్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 72/3. అభిషేక్ శర్మ(1), మయాంక్ అగర్వాల్(29) క్రీజులో ఉన్నారు.
-
క్రమంగా దూకుడు పెంచుతున్న మయాంక్, మార్‌క్రమ్
ఐడెన్ మార్‌క్రమ్, మయాంక్ అగర్వాల్‌లు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. హృతిక్ షోకీన్ వేసిన ఏడో ఓవర్‌లో మార్‌క్రమ్ ఓ సిక్స్ కొట్టగా, పీయూష్ చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్‌లో మయాంక్ ఓ ఫోర్ బాదాడు. 8 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 64/2. ఐడెన్ మార్‌క్రమ్(17) మయాంక్ అగర్వాల్(28) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. బెహ్రెన్ డార్ఫ్ వేసిన ఆరో ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 42/2. ఐడెన్ మార్‌క్రమ్(4) మయాంక్ అగర్వాల్(19) క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో వికెట్‌ను కోల్పోయింది. బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోవడంతో రాహుల్ త్రిపాఠి(7) పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు 25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 26/2. ఐడెన్ మార్‌క్రమ్(1) మయాంక్ అగర్వాల్(6) క్రీజులో ఉన్నారు.
-
త్రిపాఠి ఫోర్
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి ఓ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 9 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 22/1. రాహుల్ త్రిపాఠి(6), మయాంక్ అగర్వాల్(4) క్రీజులో ఉన్నారు.
-
హ్యారీ బ్రూక్ ఔట్
కోల్‌కతా నైట్ రైడర్స్ పై శతకం బాది ఫామ్‌లోకి వచ్చిన హ్యారీ బ్రూక్(9) ఔటైయ్యాడు. బెహ్రెన్ డార్ఫ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో సన్‌రైజర్స్ 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. 2 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 13/1. రాహుల్ త్రిపాఠి(1), మయాంక్ అగర్వాల్(2) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్‌లో 6 పరుగులు
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది సన్‌రైజర్స్. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ లు ఓపెనర్లుగా వచ్చారు. అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్‌ను వేశాడు. నాలుగో బంతికి బ్రూక్ పోర్ కొట్టగా ఈ ఓవర్‌లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. సన్‌రైజర్స్ స్కోరు 6/0. హ్యారీ బ్రూక్(5), మయాంక్ అగర్వాల్(0) క్రీజులో ఉన్నారు.
-
హైదరాబాద్ లక్ష్యం 193
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (64) అర్ధశతకంతో ఆకట్టుకోగా ఇషాన్ కిషన్ 38, తిలక్ వర్మ 37, రోహిత్ శర్మ 28 పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా, నటరాజన్, భువనేశ్వర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ లక్ష్యం 193.
-
కామెరూన్ గ్రీన్ అర్ధశతకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కామెరూన్ గ్రీన్ తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. నటరాజన్ వేసిన ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో పాటు ఓ సిక్స్ కూడా కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు ముంబై స్కోరు 172/4. టిమ్‌డేవిడ్(2), కామెరూన్ గ్రీన్(58) క్రీజులో ఉన్నారు.
-
తిలక్ వర్మ ఔట్
ముంబై ఇండియన్స్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ (37) ఔటైయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తిలక్ అదే ఊపులో మరో షాట్‌కు యత్నించి మయాంక్ మార్కండే చేతికి చిక్కాడు. దీంతో ముంబై 151 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లకు ముంబై స్కోరు 152/4. టిమ్‌డేవిడ్(1), కామెరూన్ గ్రీన్(39) క్రీజులో ఉన్నారు.
-
లోకల్ బాయ్ తిలక్ వర్మ దూకుడు
సొంత మైదానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ దూకుడుగా ఆడుతున్నాడు. మయాంక్ మార్కండే వేసిన 16వ ఓవర్‌లో ఓ సిక్స్ ఓ ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు ముంబై స్కోరు 144/3. తిలక్ వర్మ(31), కామెరూన్ గ్రీన్(38) క్రీజులో ఉన్నారు.
-
వేగం పెంచిన తిలక్‌వర్మ, కామెరూన్ గ్రీన్
ముంబై బ్యాటర్లు క్రమంగా వేగం పెంచుతున్నారు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గ్రీన్ రెండు ఫోర్లు కొట్టగా, తిలక్ వర్మ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు ముంబై స్కోరు 130/3. తిలక్ వర్మ(19), కామెరూన్ గ్రీన్(37) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ జట్టును మార్కో జాన్సెన్ దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. మొదట ఇషాన్ కిషన్ (38) మయాంక్ మార్కండే క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరగా క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ సిక్స్ కొట్టాడు. ఆ మరుసటి బంతికే మార్‌క్రమ్ చేతికి చిక్కాడు. దీంతో ముంబై జట్టు 95 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లకు ముంబై స్కోరు 95/3. తిలక్ వర్మ(0), కామెరూన్ గ్రీన్(21) క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిషన్
రోహిత్ ఔటైనా గానీ ఇషాన్ కిషన్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ముంబై స్కోరు 80/1 కామెరూన్ గ్రీన్(16), ఇషాన్ కిషన్( 35) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
ముంబై ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో ఇషాన్ ఓ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ముంబై స్కోరు 53/1 కామెరూన్ గ్రీన్(3), ఇషాన్ కిషన్( 21) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ ఔట్
ముంబై ఇండియన్స్‌కు షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ(28) ఔటైయ్యాడు. నటరాజన్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టిన హిట్‌మ్యాన్ అదే ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి మార్‌క్రమ్ చేతికి చిక్కాడు. 5 ఓవర్లకు ముంబై స్కోరు 42/1 కామెరూన్ గ్రీన్(1), ఇషాన్ కిషన్( 12) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
మార్కో జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఓ ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 5 పరుగులు రావడంతో 4 ఓవర్లకు ముంబై స్కోరు 33/0 ఇషాన్ కిషన్( 12), రోహిత్ శర్మ (20) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ దూకుడు
రోహిత్ శర్మ క్రమంగా దూకుడు పెంచాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు ముంబై స్కోరు 28/0 ఇషాన్ కిషన్( 8), రోహిత్ శర్మ (19) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ సిక్స్
మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కిషన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు ముంబై స్కోరు 15/0. ఇషాన్ కిషన్( 8), రోహిత్ శర్మ (6) క్రీజులో ఉన్నారు.
-
తొలి ఓవర్‌లో ఆరు పరుగులు
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆరంభించింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేశాడు. ఆఖరి బంతికి రోహిత్ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి.ఇషాన్ కిషన్( 1), రోహిత్ శర్మ (5) క్రీజులో ఉన్నారు.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్
-
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
-
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
-
రోహిత్ కోసం..
People love Rohit Sharma more than their own team
That's why Hyderabad ? >>>>>#SRHvsMI pic.twitter.com/jkttLTGjAo— Nisha (@NishaRo45_) April 18, 2023
-
ప్రత్యేక బ్యానర్లు "అదరహో"
MB - Ro Mutual Banner ???#SSMB28 #SRHvsMI pic.twitter.com/SL15PqUkQl
— Emey Sita... (@MrRaviWorld) April 18, 2023
-
టికెట్లతో అభిమానులు
?Ready night match ?
❤️? @suryAA_Ro @MadhuMarvel0 ❤️?#SRHvsMI pic.twitter.com/EN58FSHi6l
— ᴘᴇᴀᴄᴇ ᴍ?️?️ᴋᴇʀ➍➎ (@MadhuMarvel0) April 18, 2023