IPL 2024 MI vs DC : ఢిల్లీ పై ముంబై ఘన విజయం
ఐపీఎల్ 17లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Screengrab from video posted on x by@IPL
ముంబై ఘన విజయం
ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (71 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు.
పవర్‌ప్లే పూర్తి..
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తి అయ్యింది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 46 1. అభిషేక్ పోరల్ (8), పృథ్వీ షా(27) క్రీజులో ఉన్నారు.
వార్నర్ ఔట్..
భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ మొదటి షాక్ తగిలింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(10 8 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో 3.4వ ఓవర్‌లో 22 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది.
Fantastic Reply ?
First with the bat, and now with the ball ?
Romario Shepherd is having a special day on a special occasion ??
Watch the match LIVE on @starsportsindia and @JioCinema ??#TATAIPL | #MIvDC pic.twitter.com/1UliBrOJ8M
— IndianPremierLeague (@IPL) April 7, 2024
ఢిల్లీ లక్ష్యం 235
బ్యాటర్లు దంచికొట్టడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ(27 బంతుల్లో 49 పరుగులు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42 పరుగులు), టిమ్‌డేవిడ్ (21 బంతుల్లో 45నాటౌట్), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39నాటౌట్ ) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే చెరో రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
Innings Break!
A power-packed batting effort powers #MI to a formidable 234/5 ?
Can Delhi Capitals chase it down ?
Follow the Match ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/TMHiX0LW4P
— IndianPremierLeague (@IPL) April 7, 2024
తిలక్ వర్మ ఔట్..
ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో తిలక్ వర్మ (6) ఔట్ అయ్యాడు. దీంతో 12.4వ ఓవర్‌లో 121 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది.
ఇషాన్ కిషన్ ఔట్..
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అతడే క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్ (42; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 10.2వ ఓవర్‌లో 111 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది.
10.1: ?
10.2: ☝️Axar Patel wins the battle ? Ishan Kishan with a brilliant caught and bowled ?
Watch the match LIVE on @JioCinema and @starsportsindia ??#TATAIPL | #MIvDC pic.twitter.com/bPUYRfPf86
— IndianPremierLeague (@IPL) April 7, 2024
సూర్యకుమార్ డకౌట్..
స్వల్ప వ్యవధిలో ముంబై మరో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఫ్రేజర్-మెక్‌గర్క్ క్యాచ్ అందుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై 7.3వ ఓవర్‌లో 81 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్
దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అర్థశతకానికి ఒక్క పరుగు దూరంలో రోహిత్ ఔట్ అయ్యాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. దీంతో ముంబై 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లకు ముంబై స్కోరు 80/1. ఇషాన్ కిషన్ (25), సూర్యకుమార్ యాదవ్ (0) లు క్రీజులో ఉన్నారు.
Partnership Broken ?
Axar Patel gets the wicket of the dangerous Rohit Sharma 49(27).
Follow the Match ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/p0dnLBVXNL
— IndianPremierLeague (@IPL) April 7, 2024
6 ఓవర్లకు ముంబై స్కోరు 75/0
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 75 0. ఇషాన్ కిషన్ (20), రోహిత్ శర్మ (49) క్రీజులో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, ఝై రిచర్డ్‌సన్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
ఐపీఎల్ 17లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది.
? Toss Update ?@DelhiCapitals win the toss & elect to field against @mipaltan
Follow the Match ▶ https://t.co/Ou3aGjoDih #TATAIPL | #MIvDC pic.twitter.com/2PeWdOVdeR
— IndianPremierLeague (@IPL) April 7, 2024