IPL 2024 : ఉత్కంఠ పోరులో ఢిల్లీపై బెంగళూరు విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!

IPL 2024 - RCB vs DC : ఢిల్లీపై 47 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డుప్లెసిస్ సేన ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.

IPL 2024 : ఉత్కంఠ పోరులో ఢిల్లీపై బెంగళూరు విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!

IPL 2024 : RCB Beat Delhi Capitals by 47 Runs ( Image Credit : @IPL/Twitter/Google)

Updated On : May 13, 2024 / 12:09 AM IST

IPL 2024 – RCB vs DC : ఐపీఎల్‌ 17 సీజన్‌లో బెంగళూరు పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఐపీఎల్ ఆరంభంలో పరాజయాలతో వెనుకబడిన ఆర్సీబీ.. రానురాను పుంజుకుంటూ ప్లే‌ఆఫ్స్ రేసులో పోటీపడుతోంది. సొంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ అదే జోరు కొనసాగించింది. ఏకంగా 47 పరుగుల తేడాతో బెంగళూరు అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డుప్లెసిస్ సేన ఫ్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 188 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అక్సర్ పటేల్ హాఫ్ సెంచరీ వృథా :
ఈ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడి ఓడింది. ఆ జట్టు ప్లేయర్ అక్సర్ పటేల్ (57; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరరుగా నిలిచాడు. మిగతా ప్లేయర్లలో షాయ్ హోప్ (29), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (21) పరుగులతో రాణించారు.

రాసిఖ్ సలామ్ (10), కుల్దీప్ యాదవ్ (6), ముఖేష్ కుమార్ (3), ట్రిస్టన్ స్టబ్స్ (3), కుమార్ కుశాగ్రా (2), అభిషేక్ పోరెల్ (2), డేవిడ్ వార్నర్ (1) పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా ఢిల్లీ 19.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ 3 వికెట్లు తీసుకోగా, లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు, స్వప్పిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, కామెరాన్ గ్రీన్‌కు తలో వికెట్ దక్కింది.

హాఫ్ సెంచరీతో మెరిసిన రజత్ :
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన బెంగళూరు ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (27) పరుగులకే నిష్ర్కమించగా, కెప్టెన్ డు ప్లెసిస్ (6)కే చేతులేత్తేశాడు. రజత్ పాటిదార్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించగా, విల్ జాక్స్ (41)తో చెలరేగాడు. ఆ తర్వాత ఆటగాళ్లలో కామెరాన్ గ్రీన్ (32) పర్వాలేదనిపించాడు.

మహిపాల్ లోమ్రోర్ (13), కరణ్ శర్మ (6) పరుగులకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రాసిఖ్ సలామ్ తలో 2 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన కెమెరాన్ గ్రీన్ (32, 1/19)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాప్ 5లో బెంగళూరు :
పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడి 12 పాయింట్లతో టాప్ 5 స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడి 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.